అమెరికాను పాలిస్తున్న ట్రంప్ ఒక ఇడియట్: ఐసిస్ ఘాటు విమర్శలు..

అరబిక్ భాషలో దాదాపు 37నిమిషాల నిడివి గల ఈ వీడియోను ఐసిస్ బయటకు విడుదల చేసింది.

న్యూయార్క్: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఉగ్రవాదులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇడియట్‌గా అభివర్ణించారు. ఐసిస్ నుంచి విడుదలైన ఓ వీడియోలో ఆ సంస్థ ప్రతినిధి అబు హసన్ అల్ ముజర్ ఈ విషయాన్ని వెల్లడించాడు.

అమెరికాను పాలిస్తున్న ట్రంప్ కు ఇరాక్, సిరియా గురించి గానీ ఇస్లాం గురించి గానీ అసలేమాత్రం అవగాహన లేదని అతను పేర్కొన్నాడు. అమెరికా ప్రభుత్వం త్వరలోనే దివాళా తీయడం ఖాయమని, ఇప్పటివరకు అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా ఇమేజ్ త్వరలోనే తుడిచిపెట్టుకుపోతుందని అబు హసన్ హెచ్చరించాడు. దీనికి కారణం అమెరికాను ఒక ఇడియట్ పరిపాలించడమే అని పేర్కొన్నాడు.

America is being ruled by an 'idiot', says Isis in barb at Donald Trump

అరబిక్ భాషలో దాదాపు 37నిమిషాల నిడివి గల ఈ వీడియోను ఐసిస్ బయటకు విడుదల చేసింది. సిరియా, ఇరాక్ లలో పట్టు సడలేది లేదని, సిరియాలో మరింత బలపడేందుకు ప్రయత్నిస్తామని అబు హసన్ తెలిపాడు. ప్రస్తుతం ఇరాక్ బలగాలతో తాము ఎదుర్కొంటున్న పరిస్థితి జిహాదీ చరిత్రలోనే గొప్పదిగా అతను అభివర్ణించాడు. అంతేకాదు, జిహాదీ చరిత్రలోనే ఇది అత్యంత కీలక సమయంగా చెప్పుకొచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+