Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోస్ట్ వాంటెడ్ బాగ్దాదీని ఎలా అంతం చేశారంటే, ఫోటో, వీడియో వైరల్, ఓ లుక్కేయండి!

వాషింగ్టన్: ఐసీస్ ఉగ్రవాద సంస్థ చీఫ్, నరరూప రాక్షసుడు అబుబాకర్ అల్ బాగ్దాదీని ఎలా అంతం చేశామో చూడండి అంటూ అమెరికా కొన్ని ఫోటోలు, వీడియో విడుదల చేసింది. సిరియా పశ్చిమ ప్రాంతంలోని ఇద్లిబ్ ప్రాంతంలోని ఓ ఇంటి మీద అమెరికా బలగాలు దాడులు చేశాయి.

అమెరికా బలగాల దాడుల సమయంలో బాగ్దాదీ ఇంటిలోని సొరంగ మార్గం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో అమెరికా సొరంగంలో కుక్కను ఉదలడంతో బాగ్దాదీని వెంబడించింది. కుక్క వెంటాడటం, సొరంగం చివరన ఉన్న టెన్నల్ వరకు వెళ్లిన బాగ్దాదీ అమెరికా బలగాలకు చిక్కితో నరకం చూపిస్తారని భయంతో ఒంటిమీద ఉన్న బాంబులను పేల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇప్పటికే మూడు నాలుగు సార్లు ఐసిస్ చీఫ్ బాగ్దాదీ అంతం అయ్యాడు అని ప్రచారం జరిగింది. అయితే చివరికి నరరూప రాక్షుడు బాగ్దాదీ ప్రాణాలతోనే ఉన్నాడని వెలుగు చూసింది. బాగ్దాదీ ఎలా చనిపోయాడు అని మేము నమ్మాలి ?, సాక్షాలు ఏమైనా ఉన్నాయా ? అని ఇంతకు ముందు చాలా మంది అమెరికాను ప్రశ్నించారు.

America Releases Video And Photos Of ISIS terrorist Abu Bakr al-Bagdhdadi Killing

అలా ప్రశ్నిస్తున్న వారికి సమాధానం ఇవ్వాలని అమెరికా నిర్ణయించింది. అందుకే ఇప్పుడు అమెరికా బాగ్దాదీని ఇలా అంతం చేశామో మీరూ చూడండి అంటూ ఫోటోలు, వీడియో విడుదల చేసింది. అమెరికా విడుదల చేసిన బ్లాక్ అండ్ వైట్ వీడియోలో బాగ్దాదీ తల దాచుకున్న ఇంటిని అమెరికా బలగాలు ఎలా నేలమట్టం చేశాయో అని పూర్తిగా అర్థం అవుతోంది. అమెరికా విడుదల చేసిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+