Israel: 2000 పౌండ్ల బాంబుకు ట్రంప్ మార్గం.. హమాస్‌పై ఇజ్రాయెల్ ఆపరేషన్ మళ్లీ షురూ?
Israel: గతంలో గాజాలో విధ్వంస తీవ్రతను తగ్గించేందుకు బైడెన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎత్తివేశారు. గాజాలో హమాస్ తో ఇజ్రాయెల్ యుద్ధంలో పౌరుల మరణాల సంఖ్యను తగ్గించడానికి ఇజ్రాయెల్ కు 2,000 పౌండ్ల బరువున్న బాంబులను పంపడంపై గతంలో జో బైడెన్ నిషేధం ప్రకటించారు. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ కు 2,000 పౌండ్ల బాంబులను సరఫరా చేయడం ప్రారంభించారు. ఈ బాంబులు అమెరికా నుంచి ఇజ్రాయెల్ లోని అష్డోడ్ ఓడరేవుకు చేరుకున్నాయి. వీటిని పెద్ద ట్రక్కుల్లో సైనిక విమానాశ్రయాలకు తీసుకెళ్లారు. ఈ చర్య ఇజ్రాయెల్ సైనిక బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
హిజ్బుల్లా, హమాస్ స్థావరాలను నాశనం చేయడానికి ఇజ్రాయెల్ ఎక్కువగా రెండు ఆయుధాలను ఉపయోగించింది. అవి ఏంటంటే.. ఎంకే-84 బాంబు, హెల్పైర్ క్షిపణి.అమెరికా ఈ రెండింటిని తయారు చేస్తోంది. ఇజ్రాయెల్ అమెరికాతో ఉన్న స్నేహం నేపథ్యంలో అగ్రరాజ్యం ఈ ఒప్పందం చేసుకుంది. ఈ ఎంకే-84 బాంబును ఎయిర్ బ్లాస్ట్ మోడ్ లోకి మార్చవచ్చు. ఈ బాంబులను బంకర్ బస్టర్లు అని కూడా పిలుస్తారు. ఈ బాంబు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అణ్వాయుధేతర ఆయుధంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ బాంబును గాలిలో కూడా పేల్చవచ్చు. అంటే ఫార్ములా అణుబాంబు లాంటిది కానీ దానికి సాంప్రదాయ పేలుడు పదార్థాలు జోడించబడ్డాయి. లక్ష్యానికి కొంచెం పైన గాలిలో బాంబు పేలడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది.

గత ఒక సంవత్సరంలోనే అమెరికా ఇజ్రాయెల్ కు 14,100 ఎంకే-84 బాంబులను అందించింది. 1800 డెలివరీ ఇంకా పెండింగ్ లో ఉంది. ఈ బాంబుతో మొదటి దాడి 2023 అక్టోబర్ 9న గాజాలోని జబాలియాలో జరిగింది. 12.7 అడుగుల పొడవు, 18 అంగుళాల వ్యాసం కలిగిన ఈ బాంబు అనేక రూపాలను కలిగి ఉంది. బరువు, సామర్థ్యాన్ని బట్టి బాంబుల పేరు మారుతుంది. అక్టోబర్ 7, 2023 దాడి తర్వాత మూడు వారాల పాటు ఇజ్రాయెల్ గాజా, లెబనాన్ లపై కలిపి ప్రతి వారం 6,000 బాంబులను జారవిడిచింది. వాటిలో ఎక్కువ భాగం ఎంకే-84 బాంబులే అధికంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ కు అత్యధికంగా ఆయుధాలను అమెరికా సరఫరా చేస్తోంది. గత ఏడాది కాలంలో ఇజ్రాయెల్ అమెరికాతో 100కి పైగా ఆయుధ ఒప్పందాలను చేసుకుంది. అంటే ప్రతి 36 గంటలకు ఒక ఆయుధ ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఎక్కువగా అమెరికాలో తయారైన ఆయుధాలను ఉపయోగిస్తోంది. ఎఫ్-35, ఎఫ్-16, ఎఫ్-15 యుద్ధ విమానాలు.. ఎంకే-84, ఎంకే-83, ఎంకే-82, జేడీఎఎం బాంబులు, హెల్పైర్ క్షిపణులను ఇజ్రాయెల్ ఉపయోగిస్తోంది.
ఎంకే-84 బాంబు గురించి తెలుసుకోండి..
ఎంకే-84 బాంబు 2000 పౌండ్లు అంటే 907 కిలోగ్రామలు బరువున్న భారీ బాంబు. దీనిని BLU-117 అని కూడా పిలుస్తారు. వియత్నాం యుద్ధం నుంచి అమెరికా దీనిని ఉపయోగిస్తోంది. ఇజ్రాయెల్ ఆ బాంబులో JDAM కిట్ ను అమర్చడం ద్వారా దాడి చేస్తోంది. తద్వారా బాంబును కచ్చితమైన లక్ష్యానికి చేరవేయవచ్చు.












Click it and Unblock the Notifications