ఐఎస్ఐఎస్ ఏ రూపంలో ఉన్నా వదలం: ఒబామా

న్యూయార్క్: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఎక్కడ ఏ రూపంలో ఉన్నా వదిలేది లేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కుట్రలను ఏ దేశంలో అయినా చేధించడానికి తాము సిద్దమని ఒబామా అన్నారు.

ఉగ్రవాదంపై ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై గురువారం తమ దేశ భద్రతా అధికారుల బృందాలకు పలు సూచనలు ఇచ్చిన సందర్బంగా బరాక్ ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్బంలో అధికారుల సలహాలు అడిగి తెలుసుకున్నారు.

మా దేశ అధ్యక్షుడు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కు ఇసిల్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా మరో పేరు)ను గట్టిగా ఎదుర్కోవాలని సూచించారని, అవసరమైతే ఇతర దేశాల్లో ఉగ్రవాదులు చేస్తున్న కుట్రలను కూడా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని చెప్పారని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.

America will counter ISIS terror plotters in any country:Barack Obama

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ముఖ్యంగా పరిపాలన బలహీనంగా ఉన్న దేశాలను లక్షంగా చేసుకుని దాడులు చేస్తున్నదని, అలాంటి దేశాలకు పాలనపరమైన సహాయం చేసి ఉగ్రవాదాన్ని అంతం చెయ్యాలని పిలుపునిచ్చారు.

ఇస్లామిక్ స్టేట్ విషయంలో ప్రపంచంలో తమతో దౌత్యపరమైన సంబంధాలు ఉన్న దేశాలన్నింటితో కలిసి సాగేందుకు ఒబామా సిద్దంగా ఉన్నారని, ఉగ్రవాదం విషయంలో తమ ముందు సవాళ్ల గురించి అమెరికా ప్రజలతో బబామా చాల స్పష్టంగా మాట్లాడరని, మన దేశాన్ని ఏమి చెయ్యలేరని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+