బదలీ కోరితే ఉద్యోగం ఔట్: భారత సంతతి ఉద్యోగికి అమెరికా కంపెనీ లక్షడాలర్ల పరిహారం
వాషింగ్టన్: ఓ భారతీయుడిపై వివక్ష చూపించినందుకు గాను అమెరికాకు చెందిన కాంబర్ కార్పోరేషన్ సంస్థ అతనికి 1,00,000 డాలర్ల పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. అతను కంపెనీని కోర్టుకు లాగడంతో పరిహారం కోసం ఒప్పుకుంది.

మరోచోటుకు బదలీ చేయాలని కోరడంతో
తనపై వివక్ష చూపించిందని దావా వేస్తే, దానిని పరిష్కరించుకునేందుకు ఆ కంపెనీ ఈ మొత్తాన్ని చెల్లించడానికి ముందుకు వచ్చింది. అశోక్ పేయ్ అనే వ్యక్తి దివ్యాంగుడైన తన కుమారుడిని చూసుకునేందుకు, అతడికి దగ్గరగా ఉండేందుకు మరోచోటుకు బదిలీ చేయమని కంపెనీకి విజ్ఞప్తి చేశారు.

ఉద్యోగం నుంచి తొలగించింది
కొడుకు కోసం కొన్ని రోజులు సెలవు అడిగారు. కానీ కంపెనీ నిరాకరించడంతో పాటు అతనిని ఉద్యోగం నుంచి తీసివేసింది. దీంతో ఆయన అమెరికా సమాన ఉద్యోగ అవకాశ కార్పొరేషన్‌ను(ఈఈఓసీ- అమెరికా ఈక్వల్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ కమిషన్) ఆశ్రయించాడు.

విచారణలో తేలిన ఉల్లంఘన
ఆ కంపెనీలో బాధితుడు ఫెడరల్ కాంట్రాక్టరుగా పని చేశాడు. తనను ఉద్యోగంలో నుంచి తొలగించి వయసులో తనకంటే ఇరవై ఏళ్ల చిన్నవాడైన వ్యక్తిని నియమించారని, తన కొడుకు వైకల్యంతో పాటు తన వయసు కారణంగా కూడా తనపై వివక్ష చూపారని అతను దావా వేశాడు. దీనిపై విచారణ జరిపిన ఈఈఓసీ.. కంపెనీ చట్టాలను ఉల్లంఘించినట్లు పేర్కొంది.

లక్ష డాలర్ల పరిహారం
అశోక్ కుమారుడి ఆరోగ్య పరిస్థితి వల్ల బదిలీకి నిరాకరించడం చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. కాంబర్ వర్జీనియా కార్యాలయంలో ఉద్యోగి పట్ల వివక్ష చూపినట్లు అమెరికా న్యాయ విభాగం కూడా తెలిపింది. దీంతో కంపెనీ ఈ దావాను పరిష్కరించేందుకు అతనికి లక్ష డాలర్ల నష్టపరిహారం చెల్లించేందుకు అంగీకారం తెలిపింది.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం










Click it and Unblock the Notifications