వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదులకు మద్దతు: యువకుడికి 15 ఏళ్లు జైలు

|
Google Oneindia TeluguNews

అలెగ్జాండ్రి: సోషల్ మీడియాలో, ట్విట్టర్ లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్)కు మద్దతుగా ట్విట్లు చేస్తూ పలువురు యువకులను రెచ్చగొడుతున్న యువకుడికి అమెరికా న్యాయస్థానం శిక్ష విదించింది. ఇక ముందు ఉగ్రవాదుల పట్ల సానుభూతి చూపించే వారికి ఇదే శిక్ష పడుతుందని కోర్టు హెచ్చరించింది.

అమెరికాలో ఆలీ షుక్రీ అమీన్ (17) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతను కొంత కాలం నుండి ట్విట్టర్ లో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు చేస్తున్న అరాచకాలను అనేక మందికి పోస్టు చేశాడు. దాదాపు 7,000 మందికి షేర్ చేశాడు.

American Teen Behind Islamic State Tweets Faces 15 Years in Prison

ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులకు అందరూ మద్దతు ఇవ్వాలని మనవి చేశాడు. ఐఎస్ఐఎస్ కు మద్దతు ఇచ్చే వారికి తాను రుణపడి ఉంటానని, తానకు చేతనైన నగదు సహాయం చేస్తానని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అంతే కాకుండా ఐఎస్ఐఎస్ కి నగదు బదిలీలు, లావాదేవీలు ఎలా చెయ్యాలో సలహాలు, సూచనలు ఇచ్చాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఆలీ షుక్రీ అమీన్ ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చినా, వారి మీద సానుభూతి చూపించినా నేరమని చెప్పి ఆలీకి 15 సంవత్సరాల జైలు శిక్ష విదిస్తున్నామని కోర్టు తెలిపింది. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చిన వ్యక్తికి 15 సంవత్సరాలు జైలు శిక్ష పడటం అమెరికాలో ఇదే మొదటి సారి.

English summary
Ali Shukri Amin (17) who sent more than 7,000 Twitter messages in support of IS, admitted to providing advice and encouragement to the extremist outfit and its supporters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X