విమానంలో బట్టలన్నీ విప్పేసి నగ్నంగా తిరిగిన మహిళ.. ఎందుకంటే..?
అమెరికాలోని బాల్టిమోర్ నుంచి మియామీ కు నిత్యం విమానాలు ప్రయాణిస్తుంటాయి. అయితే రోజూవారీ మాదిరిగానే బాల్టిమోర్ నుంచి మియామీకి 160 మంది ప్రయాణికులతో అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం బయల్దేరింది. అయితే కొద్దిసేపటి తర్వాత ఆ విమానంలో అనూహ్యమైన ఘటన చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణించే ఓ మహిళకు ఏమైందో తెలియదు కానీ ఒక్కసారిగా ఒంటి మీద ఉన్న బట్టలు మొత్తం విప్పేసింది. అలాగే నగ్నంగా తిరుగుతూ తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించింది. ప్రయాణికులు వెంటనే కాక్ పిట్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. దాంతో వాళ్లు వచ్చి ఆ మహిళను బలవంతంగా సీటులో కూర్చోబెట్టి.. పైలట్ కు సమాచారం అందించారు. విమానం మియామీకు చేరుకున్న వెంటనే పైలట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఆ మహిళా ప్రయాణికురాలు ఇలా ఎందుకు చేసిందన్న విషయంపై క్లారిటీ లేదు. ఈ ఘటన సెప్టెంబర్ 11న అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఫ్లైట్ నెంబర్ AA1779 లో జరిగింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిర్ క్రాఫ్ట్ కమ్యూనికేషన్స్ అడ్రెసింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్, అమెరికన్ ఎయిర్ లైన్స్ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ సెంటర్ సంయుక్తంగా తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 11 న రాత్రి 9 గంటల సమయంలో విమానం బాల్టిమోర్ నుంచి మియామీకి బయల్దేరింది. ఆ సమయంలో విమానంలో 160 మంది ప్రయాణికులు ఉన్నారు. అలా కొద్దిదూరం విమానం ప్రయాణించాక 9డీ సీటులో కూర్చొన్న మహిళ ఒక్కసారిగా తన బట్టలను విప్పేసింది. పూర్తిగా నగ్నంగా అటు ఇటూ తిరుగుతూ కేకలు వేయసాగింది. అది గమనించిన తోటి ప్రయాణికులు విమానంలోని కాక్ పిట్ సిబ్బందికి సమాచారం అందించారు.

కాక్ పిట్ సిబ్బంది అతికష్టం మీద ఆ మహిళను తన సీటులో కూర్చొబెట్టారు. ఆ తర్వాత ఎయిర్ లైన్స్ ఆపరేషన్స్ సెంటర్ కు సమాచారం అందించారు. విమానం మియామీలో ల్యాండ్ అయిన వెంటనే సదరు మహిళపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అయితే విమానం మియామీలో ల్యాండ్ అయిన వెంటనే అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆ మహిళపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది తెలియాల్సి ఉంది. ఇక ఆ మహిళ ఎవరు..? విమానంలో అలా చేయడానికి గల కారణాలు ఏంటి..? తదితర అంశాలపై దర్యాప్తులో వెల్లడికానుంది.












Click it and Unblock the Notifications
