అమెరికాలో సిక్కులపై వరుస దాడులు.. కారణం ఇదే!
వాషింగ్టన్: ఇటీవలి కాలంలో అమెరికాలో సిక్కుల పైన పలుమార్లు దాడులు జరిగాయి. 9/11 తీవ్రవాద దాడి అనంతరం అమెరికాలో సిక్కుల పైన దాడులు చాలా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇటీవల కాలిఫోర్నియాలో 68 ఏళ్ల అమృక్ సింగ్ బాల్ పైన ఇద్దరు తెల్లవాళ్లు దాడికి పాల్పడ్డారు.
ఇరవయ్యేళ్ల వయస్సులో ఉన్న ఇద్దరు అతని పైన శనివారం ఉదయం దాడికి పాల్పడ్డారు. సిక్కుల పైన వరుసగా అమెరికాలో దాడి జరగడం వెనుక ఓ కారణం ఉందని తెలుస్తోంది. అమెరికన్లు చాలామంది సిక్కులను ముస్లీంలుగా భావిస్తున్నారట.
ఈ కారణంగానే దాడులు జరుగుతున్నాయని అంటున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఇటీవల రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిక్కులను ముస్లీంలుగా భావించి కొందరు దాడి చేస్తున్నారని అంటున్నారు.

2001 సెప్టెంబర్ 11వ తేదీన తీవ్రవాదుల దాడి అనంతరం అమెరికాలో యాంటీ ఇస్లామిక్ సెంటిమెంట్ బాగా పెరిగిందని, ఈ నేపథ్యంలో సిక్కులకు బాగా పొడగాటి గెడ్డం ఉండటంతో వారిని ముస్లీంలుగా భావించి దాడులు చేస్తున్నారని అంటున్నారు.
కాగా, 2001లో తీవ్రవాదుల అటాక్ అనంతరం సిక్కుల పైన ఒక్క నెలలోనే దాదాపు 300 దాడులు లేదా వివక్ష జరిగిందని తెలుస్తోంది. ఇటీవల ప్యారిస్‌లో తీవ్రవాదుల దాడుల అనంతరం మరోసారి సిక్కులు లక్ష్యంగా మారారని అంటున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications