టెక్కీల తొలగింపు: మైక్రోసాఫ్ట్‌కు షాకిచ్చిన సీనియర్ ఉద్యోగి
శాన్‌ఫ్రాన్సిస్కో: భారీగా సంస్థలోని ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ నుంచి ఓ సీనియర్ ఉద్యోగి వైదొలిగారు.
శాన్‌ఫ్రాన్సిస్కో: భారీగా సంస్థలోని ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ నుంచి ఓ సీనియర్ ఉద్యోగి వైదొలిగారు. కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(సీఐవో) జిమ్ డుబోయిస్ తన పదవికి రాజీనామా చేశారు.

ఉద్యోగుల తొలగింపే కారణం
సంస్థ ఇటీవల ప్రకటించిన ఉద్యోగుల తొలగింపు నిర్ణయమే జిమ్ రాజీనామాకు కారణం కావడం గమనార్హం. జిమ్ డుబోయిస్ 1993 నుంచి మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్నారు.

2013 నుంచీ సీఐఓగా..
కంపెనీలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు జిమ్. కాగా, అతను వృత్తిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఎక్కువగా దృష్టి పెట్టేవారు. 2013లో సంస్థ ఆయనను సీఐవోగా నియమించింది.

అసంతృప్తి వ్యక్తం చేస్తూ..
అయితే, తాజాగా మైక్రోసాఫ్ట్.. భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్న జిమ్ తన పదవికి రాజీనామా చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

జిమ్ స్థానంలో డెల్ బెనె
కాగా, జిమ్ స్థానంలో సీనియర్ ఉద్యోగి కర్ట్ డెల్‌బెనెను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సర్వీసెస్‌ను అభివృద్ధి చేసే యోచనలో ఉన్న మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో కోత విధించేందుకు నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే అమెరికా మినహా మిగతా దేశాల్లోని సేల్స్ విభాగంలో 3వేల ఉద్యోగులను తీసేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
-
అమెరికాలో ‘తెలుగు’ అందాలు: చిలకలూరిపేట చిన్నది Vs కరీంనగర్ క్వీన్ -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం!












Click it and Unblock the Notifications