ఆదాయం: ఫోర్బ్స్‌లో బిగ్ బీ, సల్మాన్, అక్షయ్, ధోనీ
న్యూయార్క్: ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్ 100-2015 (వినోదం) ప్రముఖుల్లో అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నట్లు ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన లిస్ట్‌లో ఉంది.
ప్రపంచంలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న టాప్-100 సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్‌కు చెందిన అమితాబ్, సల్మాన్, అక్షయ్ కుమార్‌లతో పాటు భారత క్రికెట్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీలకు చోటు దక్కడం గమనార్హం.
ప్రముఖ పోర్బ్స్ ఈ ఏడాది తన వార్షిక జాబితాలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ జాబితాలో అమెరికా బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ 300 మిలియన్ డాలర్ల సంపాదనతో అగ్రస్థానంలో నిలిచాడు.

ఫోర్బ్స్ జాబితా
తొలిసారి ఈ జాబితాలో ప్రవేశించిన అమితాబ్, సల్మాన్ 33.5 మిలియన్ డాలర్ల చొప్పున ఆదాయంతో సంయుక్తంగా 71వ ర్యాంకులో నిలిచారు. 32.5 మిలియన్ డాలర్ల సంపాదనతో అక్షయ్ కుమార్ 76వ స్థానంలో ఉన్నారు.

ఫోర్బ్స్ జాబితా
31 మిలియన్ డాలర్ల ఆదాయంతో ధోనీ 82వ ర్యాంకు సాధించారు. అయితే ప్రస్తుతం దేశంలో అతిపెద్ద సూపర్ స్టార్‌గా కొనసాగుతున్న షారుఖ్ ఖాన్‌కు గానీ మరే ఇతర మహిళా సెలబ్రిటీలకు గానీ ఈ జాబితాలో చోటు లభించలేదు.

ఫోర్బ్స్ జాబితా
1999 నుంచి ప్రతి ఏటా ఫోర్బ్స్ ఈ జాబితాలను విడుదల చేస్తోంది. వినోద ప్రపంచంలో చోటుచేసుకుంటున్న విస్తృత మార్పులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది జాబితా రూపకల్పనలో తొలిసారి విభిన్న పద్ధతులను అనుసరించినట్లు ఆ పత్రిక స్పష్టం చేసింది.

ఫోర్బ్స్ జాబితా
కాగా, అమితాబ్, సల్మాన్‌లు హాలీవుడ్ నటులు లియోనార్డో డికాప్రియో, చాన్నిగం టాటమ్ (చెరో 2.9 కోట్ల డాలర్లు) కంటే ఎక్కువ సంపాదిస్తున్నారని ఫోర్బ్స్ తెలిపింది.

ఫోర్బ్స్ జాబితా
గాయకుడు టేలర్ స్విఫ్ట్ (8), టెన్నిస్ దిగ్గజం రోడర్ ఫెదరర్ (16), బుల్లితెర నటుడు కిమ్ కర్దాషియాన్ (33), గోల్ఫ్ ఆటగాడు టైగర్ ఊడ్స్ (37), నటులు టామ్ క్రూయిస్ (87, లియోనార్డో డికాప్రియో (89) స్థానాల్లో ఉన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications