యుద్ధం ఎఫెక్ట్.. పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి..? భారత్ కు వార్నింగ్..!
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇప్పట్లో తగ్గేలా లేదు. ఇరాన్, ఇజ్రయెల్- అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ ఇంధనానికి జీవనాడి అయిన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముడి చమురు కొరత ప్రభావం భారత్ తోపాటు, ప్రపంచ దేశాలపై తీవ్రంగా పడనుంది. ఇక భారత్ కు అవసరమైన ముడి చమురులో ఎక్కువ భాగం పశ్చిమాసియాలోని హర్మూజ్ జలసంధి ద్వారానే వస్తుంది.
హార్మూజ్ జలసంధి మూసివేసిన క్రమంలో భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు. ఇదే విషయంపై నీతి ఆయోగ్ మాజీ మాజీ చీఫ్, మాజీ జీ20 కూటమి షెర్పా అమితాబ్ కాంత్ కీలక విషయాలను వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు క్రమంగా పెరుగుతున్నాయని అన్నారు. ఈ మేరకు కీలక
ట్వీట్ చేశారు.
" ముడి చమురు ధరల్లో ప్రతి 10 డాలర్లు పెరుగుదల వల్ల భారత్ వార్షిక దిగుమతి బిల్లుకు అదనంగా 13 నుంచి 14 బిలియన్ డాలర్ల భారం పడుతుంది. ఇది కరెంట్ అకౌంట్ లోటును పెంచి రూపాయి విలువపై ఒత్తిడిని తీసుకొస్తుంది. ఇక భారత్ తదుపరి అడుగు కేవలం స్వచ్ఛ ఇంధన సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా.. స్వచ్ఛమైన విద్యుత్తును అందించడం.. అలాగే అధిక PLF కలిగిన సోలార్-విండ్ హైబ్రిడ్ వ్యవస్థలు, ఎలక్ట్రిక్ వాహనాలను పెంచడం, ఆధునిక గ్రిడ్ లు, భారీ స్థాయి బ్యాటరీ, పంప్డ్ హైడ్రో స్టోరేజ్ అలాగే న్యూక్లియర్ వంటి స్థిరమైన తక్కువ-కార్బన్ బేస్ లోడ్ పద్ధతులు.. వీటన్నింటినీ పెంచడం ఇప్పుడు మనకు అవసరం.." అని ట్వీట్ చేశారు.

ఇక గురువారం నాటికి చమురు ధరలు మరింతగా పెరిగాయి. 3 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. దాంతో ప్రస్తుతం చమురు ధర ఒక్కో బ్యారెల్ 84 డాలర్లకు చేరింది. గత 5 రోజులుగా చమురు ధరలు 20 శాతానికి పైగా ఎగబాకాయి. అలాగే గత 3 నెలల్లో 34 శాతం పెరిగాయి. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో కేవలం 5 రోజుల్లోనే 20 శాతం ధరలు పెరిగాయి. యుద్ధం ప్రభావం కారణంగా రానున్న రోజుల్లో పెట్రోల్, డీజీల్ ధరల్లో భారీగా మార్పులు ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Every per barrel rise in crude prices can add –14B to India’s annual import bill, widen the current account deficit and pressure the rupee. Geopolitical shocks will keep testing our energy security.
— Amitabh Kant (@amitabhk87) March 5, 2026
India’s next step isn’t just adding clean capacity but it’s delivering…
అయితే ప్రస్తుతం భారత్ లో దేశీయ అవసరాలకు సరిపోయే విధంగా ముడి చమురు నిల్వలు ఉన్నట్లు సమాచారం. మరో 6-8 వారాల వరకు సరిపోయేలా నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే దాదాపు సగం ముడి చమురు, ఎల్పీజీ దిగుమతులు హార్మూజ్ జలసంధి నుంచే వస్తాయి. ఈ నేపథ్యంలో కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం రోజూవారీ సమీక్షలు నిర్వహిస్తోందని ఓ సీనియర్ అధికారి స్పష్టం చేశారు.
-
యుద్ధం వేళ మోదీ చాణక్యం.. కర్ర విరక్కుండా.. పాము చావకుండా..! -
భారత్కు ఇరాన్ బంపరాఫర్!.. ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్! -
సాక్షాత్ FBI చీఫ్ కే దిక్కులేదు- ఇరాన్ హ్యాకర్ల పంజా -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
LPG పై కేంద్రం మరో గుడ్ న్యూస్ -రాష్ట్రాలకు లేఖలు..! -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
దేశంలో పెట్రోల్, గ్యాస్ స్టాక్.. రెండు నెలలే -
గ్యాస్, పెట్రోల్, డీజిల్ పై ఏపీ వాసులకు సూపర్ న్యూస్.. మీకు దిగులు లేదు! -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
భారత్లోకి " పైప్డ్ " గ్యాస్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది కూడా అయిపోతుందా?? -
పెట్రోల్, గ్యాస్ సంక్షోభం తీవ్రం- కేంద్రమంత్రులతో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..!












Click it and Unblock the Notifications