నన్ను టీవీలో అందంగా చూపించండి: 18 ఏళ్ల నిందితురాలు
సిడ్నీ: తాను పరారీలో ఉన్నంత మాత్రాన అందవిహీనంగా ఉన్న ఫోటోలు టీవీలలో ప్రసారం చేస్తారా? కాస్త అందంగా ఉన్న ఫోటోలను ప్రసారం చేయాలని మీడియాను 18 ఏళ్ల నిందితురాలి అడిగిన సంఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది.
ఆ అమ్మాయి పేరు అమీ షార్ప్. మీరు దయచేసి నేను పంపుతున్న ఈ ఫోటోలు వాడాలని, అలా వాడితే ధన్యవాదాలు అని, తనను కాస్త అందంగా చూపే చిత్రాలు వాడండని ఆమె టీవీలకు కూడా సూచించడం గమనార్హం.
ఓ ఆస్తి కేసులో పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న అమీ షార్ప్ టీవీ చానళ్లకు ఫోటోలు పంపించింది.

ఓ ఆస్తి కేసులో భాగంగా ఆమె కోసం మెల్ బోర్న్ పోలీసులు వెతుకుతున్నారు. ఆమెకు సంబంధించిన రెండు చిత్రాలను స్థానిక మీడియాకు విడుదల చేశారు. వీటిని టీవీ చానళ్లు ప్రసారం చేశాయి. వాటిపై మొట్టమొదటిగా ఆమెనే స్పందించింది.
తను మరింత గ్లామర్‌గా కనిపిస్తున్న చిత్రాలను ఆమె పంపించింది. తమపై కథనాలు ఇచ్చే సమయంలో పాత చిత్రాలకు బదులుగా.. తాను ఇచ్చిన చిత్రాలను వాడాలని, పోలీసులు ఇచ్చిన చిత్రాలు సరిగా లేవని, వాటిని చూసి తాను అసంతృప్తికి గురయ్యానని చెప్పింది.
ఇదిలా ఉండగా, ఆమె చిత్రాలను పోస్ట్ చేసిన ఐపీ అడ్రస్ ఆధారంగా విచారించిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని, కేవలం ఆస్తి కేసులోనే ఆమెను కస్టడీలోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications