వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూమివైపు దూసుకొస్తున్న బుర్జ్‌ఖలీఫా కంటే పెద్ద ఆస్టరాయిడ్: ప్రమాదం లేదు

|
Google Oneindia TeluguNews

హ్యూస్టన్: అతిపెద్ద ఆస్టరాయిడ్ ఒకటి భూమి వైపు దూసుకొస్తోంది. ఇది వచ్చే నెలలో అంటే ఫిబ్రవరిలో భూమికి సమీపం నుంచి వెళ్లనుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూమపై గల అతి పెద్ద బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా కంటే ఈ ఆస్టరాయిడ్ పెద్దగా ఉంటుంది.

 ఏజే129 ఒకవేళ భూమిని ఢీకొంటే

ఏజే129 ఒకవేళ భూమిని ఢీకొంటే

దీనికి శాస్త్రవేత్తలు 2002 AJ129గా పేరు పెట్టారు. ఫిబ్రవరి 4న భూమికి 26 లక్షల మైళ్ల దూరం నుంచి ఈ గ్రహ శకలం వెళ్లనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇంత దూరం కూడా చాలా దగ్గరే అని నాసా చెబుతోంది. 1.1 కి.మీ. పొడువున్న ఆస్టరాయిడ్ ఒకవేళ భూమిని ఢీకొంటే అది భూమి మొత్తాన్ని కప్పేసేంత దుమ్ము ధూళిని వెదజల్లుతుందని, దీనివల్ల భూగ్రహం మొత్తం అంధకారమవుతుందని నాసా తెలిపింది.

 ఎలాంటి ముప్పులేదు

ఎలాంటి ముప్పులేదు

ఇదిలా ఉండగా, ఎలాంటి వదంతులను నమ్మవద్దని, ఫిబ్రవరి 4న భూమికి ఎటువంటి ముప్పులేదని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. ఫిబ్రవరిలో ఆస్టరాయిడ్‌ భూమి వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో నాసా సైంటిస్టులు ఈ విషయం చెబుతున్నారు.

 వేగవంతమైన ఎయిర్ క్రాఫ్ట్ కంటే 15 రెట్ల వేగం

వేగవంతమైన ఎయిర్ క్రాఫ్ట్ కంటే 15 రెట్ల వేగం

ఈ ఆస్టరాయిడ్ వేగం 67వేల ఎంపీహెచ్ (107,826 కేఎంహెచ్)గా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రపంచంలోని వేగవంతమైన ఎయిర్ క్రాఫ్ట్ కంటే 15 రెట్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది.

 నిర్ణీత కక్ష లేకుండా తిరిగేవే గ్రహశకలాలు

నిర్ణీత కక్ష లేకుండా తిరిగేవే గ్రహశకలాలు

కాగా, విశ్వంలో ఓ నిర్ణీత కక్ష్య లేకుండా తిరిగేవే గ్రహ శకలాలు. ఇవి గ్రహాల కంటే చిన్నగా ఉంటాయి. సాధారణంగా సౌర కుటుంబంలో కుజుడు, గురు గ్రహాల మధ్య ఈ గ్రహ శకలాలు ఎక్కువగా ఉంటాయి.

English summary
A gigantic asteroid which is larger than the world's tallest building, the Burj Khalifa, will hurtle past our planet in around two weeks time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X