వరుసగా రెండోసారి పెను భూకంపం: 6.3 తీవ్రతతో: వణికిన ద్వీపం: సునామీ ముప్పుతో
ఒట్టావా: కెనడా సమీపంలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలండ్స్‌లో గురువారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైంది. గురువారం రాత్రి 11:36 నిమిషాలకు ఈ భూకంపం నమోదైంది. ఎడ్వర్డ్ ఐలండ్స్‌లో భూఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున భూమి కంపించిందని అమెరికా జియాలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప తీవ్రత అంచనాలకు మించి ఉండటం వల్ల తొలుత సునామీ రావొచ్చనే అనుమానాలు తలెత్తినప్పటికీ.. అలాంటి పరిస్థితులు చోటు చేసుకోలేదు.
సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు. కొద్దిరోజుల కిందటే కెనడాలోని అలస్కాలో 7కు పైగా తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అప్పట్లో సునామీ హెచ్చరికలను సైతం జారీ చేశారు. కొద్దిసేపటి తరువాత వాటిని ఉపసంహరించుకున్నారు. అదే తరహా పరిస్థితులు అదే కెనడాకు ఆనుకుని ఉన్న ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలండ్స్‌లో చోటు చేసుకున్నాయి. భూకంపం వల్ల భవనాలు దెబ్బతిన్నాయి. బీటలు వారాయి. ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఆస్తినష్టం గానీ సంభవించినట్లు వార్తలు రాలేదు.

భూమి ప్రకంపనలు సంభవించిన వెంటనే స్థానికులు రోడ్ల మీదికి పరుగులు పెట్టారు. కొన్ని గంటల పాటు రోడ్ల మీదే గడిపారు. భూకంపం తరువాత కూడా తేలికపాటి ప్రకంపనలు చోటు చేసుకోవడంతో.. ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. అదే సమయంలో సునామీ రావచ్చొనే అనుమానాలు వ్యక్తం కావడంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. పరిస్థితులు క్రమంగా సద్దుమణిగడంతో స్థానికులు కుదురుకున్నారు. కొద్దిరోజుల వ్యవధిలోనే రెండు భారీ భూకంపాలు సంభవించడం పట్ల కెనడాలో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.
Recommended Video
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications