7.3 తీవ్రతతో వణికించిన పెను భూకంపం
Chile earthquake 2024: చిలీలో పెను భూకంపం సంభవించింది. ఆ దేశ ఉత్తర తీర ప్రాంతాన్ని వణికించింది. భూకంప తీవ్రత అనూహ్యంగా ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సునామీ హెచ్చరికలను జారీ చేశారు. ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు.
తైవాన్ రాజధాని శాంటియాగోకు ఉత్తర దిక్కున అర్జెంటీనా- బొలీవియా సరిహద్దుల్లో గల శాన్ పెడ్రో డీ అటకామా ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అటకామాకు ఈశాన్య దిక్కున 41 కిలోమీటర్ల దూరంలో చిలీ కాలమానం ప్రకారం రాత్రి 9:51 నిమిషాలకు భూమి ప్రకోపించినట్లు వివరించింది.

రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.3గా రికార్డయింది. ఉపరితలం నుంచి 12 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో సంభవించిన పెను కదలికల వల్ల భూమి ప్రకోపించింది. భూకంప కేంద్రానికి 265 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతిపెద్ద తీర ప్రాంత నగరం ఆంటోఫొగస్టాలో కొన్ని భవనాలు బీటలు వారాయంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చైసుకోవచ్చు.
దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీని తీవ్రతకు తీర ప్రాంతం అల్లకల్లోలమైంది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ముందుజాగ్రత్త చర్యగా అధికారులు తీర ప్రాంతాలను ఖాళీ చేయించారు.
చిలీలో భూకంపాలు సాధారణమే గానీ ఈ స్థాయి తీవ్రతతో రావడం కొన్ని సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. భూమి తరచూ ప్రకంపించే రింగ్ ఆఫ్ దేశాల జాబితాలో ఉంది చిలీ. బొలీవియా, చిలీ, ఈక్వెడార్, పెరూ, కోస్టారికా, గ్వాటెమాల, మెక్సికో, అమెరికా, కెనడా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండొనేషియా, న్యూజిలాండ్, అంటార్కిటికా దేశాలు రింగ్ ఆఫ్ ఫైర్ లిస్టులో ఉన్నాయి.












Click it and Unblock the Notifications