ఏడాదిగా టన్నెల్‌లోనే లగ్జరీ లైఫ్: 32 వేల డాలర్ల హ్యాండ్‌బ్యాగ్: పొగ బెట్టిన ఇజ్రాయెల్: సీసీటీవీలో రికార్డ్
Yahya Sinwar: గాజా ప్రధాన కేంద్రంగా తన మధ్య ఆసియా దేశాల్లో కార్యకలాపాలను ఉధృతంగా కొనసాగిస్తోన్న మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఆట కట్టించింది ఇజ్రాయెల్. దాని అధినేత యాహ్యా సిన్వర్‌ను మట్టుబెట్టింది. ఇటీవలే గాజాపై నిర్వహించిన డ్రోన్ దాడిలో ఆయన హతం అయ్యారు. గత ఏడాది ఇదే అక్టోబర్‌లో హమాస్ జరిపిన నరమేథానికి ప్రతీకారాన్ని తీర్చుకున్నట్టయింది.
మారణహోమం..
2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌ను గట్టి దెబ్బ కొట్టింది హమాస్. సరిహద్దులకు ఆనుకుని ఉన్న పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. గాజా సరిహద్దు వెంబడి ఉన్న ఉన్న ఇజ్రాయెల్ గ్రామాలపై విరుచుకుపడింది. ఈ దాడిలో 1,200 మంది మరణించారు. 252 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా పట్టుకుంది. ఈ ఏడాది కాలంలో 30 మంది బందీలు మరణించారు. ఇప్పటికీ 97 హమాస్ ఆధీనంలో ఉన్నారు.

సిన్వర్ ఖతం..
దీనికి ప్రతీకారంగా తరచూ ప్రతీకార దాడులకు దిగుతూ వచ్చింది ఇజ్రాయెల్. ఇటీవలే గాజాలోని రఫా జిల్లాలో హమాస్ అధినేత యాహ్యా సిన్వర్‌ను మట్టుపెట్టింది. ఇజ్రాయెల డిఫెన్స్ ఫోర్సెస్‌కు చెందిన 828 బ్రిగేడ్, షిన్ బెట్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ ఇది. ఈ దాడుల్లో ఆయన మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఏడాది కాలంగా..
యాహ్యా సిన్వర్‌కు చెందిన మరో కొత్త వీడియోను ఐడీఎఫ్ విడుదల చేసింది. గత ఏడాది తమ దేశంపై దాడి జరిగినప్పటి నుంచి ఆయన ఓ భారీ టెన్నల్‌లో నివసించినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్‌పై భీకర దాడి జరగడానికి ఒక్క రోజు ముందు అంటే 2023 అక్టోబర్ 6వ తేదీ నాడే కుటుంబంతో కలిసి టన్నెల్‌లోకి వెళ్లిపోయారని తెలిపింది.
కొత్త వీడియో..
ఆహార పాకెట్లు, నిత్యావసర వస్తువులు తీసుకుని కుటుంబంతో కలిసి టన్నెల్‌లోకి వెళ్తోన్నప్పటి వీడియోను తాజాగా ఐడీఎఫ్ అధికార ప్రతినిధి, రియర్ అడ్మిరల్ డేనియల్ హగేరి విడుదల చేశారు. భార్య, పిల్లలను తీసుకుని సిన్వర్ టన్నెల్‌లోకి వెళ్తోండటం ఈ వీడియోలో స్పష్టంగా రికార్డయింది.
🔴 New footage: On October 6, 2023, Yahya Sinwar and his family were hiding in Hamas’ underground tunnels, while his terrorists orchestrated the brutal massacre of over 1,200 innocent Israeli men, women, and children.
— Israel ישראל (@Israel) October 19, 2024
One year later, justice was delivered.
Sinwar is no more. pic.twitter.com/F0Y0ylLx7K
ప్రజల ప్రాణాలు అడ్డు..
గాజా ప్రజల ప్రాణాలను అడ్డుగా పెట్టుకుని యాహ్యా సిన్వర్ ప్రత్యేక వేర్పాటు ఉద్యమాన్ని సాగించాడంటూ ఆరోపించారు. తన కుటుంబంతో సురక్షితంగా బంకర్లు, టన్నెల్‌లల్లో నివసిస్తూ, ప్రజల ప్రాణాలను బలి పెట్టాడని విమర్శించారు. టన్నెల్ ద్వారానే ఖాన్ యూనిస్- రఫా ప్రాంతాల మధ్య తరచూ రాకపోకలు సాగించినట్లు గుర్తించామని చెప్పారు.
లగ్జరీ జీవితం..
టన్నెల్‌లో యాహ్యా సిన్వర్ అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపినట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది. టన్నెల్‌లో వెళ్తోన్న సమయంలో ఆయన భార్య చేతిలో అత్యంత ఖరీదైన బిర్కిన్ బ్యాగ్ ఉండటం కనిపించింది. దీని విలువ 32,000 డాలర్లుగా పేర్కొంది ఇజ్రాయెల్. టన్నెల్‌లో టీవీ, ఏసీ, బెడ్స్.. వంటి సౌకర్యాలు ఉన్నట్లు గుర్తించింది.
هل زوجة السنوار دخلت معه إلى النفق في السادس من أكتوبر وبحوزتها حقيبة لشركة بيركين التي تقدر كلفتها بنحو 32 ألف دولار؟! أترك لكم التعليق.
— افيخاي ادرعي (@AvichayAdraee) October 19, 2024
بينما لا يملك سكان غزة الأموال الكافية لخيمة أو للمواد الأساسية نرى أمثلة كثيرة لحب يحيي السنوار وزوجته الخاص للأموال… pic.twitter.com/sGft4Qg9s8












Click it and Unblock the Notifications