Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Donald Trump: ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ట్రంప్.. వైరల్ అవుతున్న భారతీయ చెఫ్ పోస్ట్..

పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. ఎట్టకేలకు విజయం సాధించారు. దీంతో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశవిదేశాల నుంచి ఫోన్లు చేస్తూ ఆయన్ను అభినందిస్తున్నారు. అయితే ఓ భారతీయ చెఫ్ ట్రంప్ గురించి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇన్ స్టాగ్రామ్ వేదికగా అతను చేసిన పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పోస్ట్ లో ట్రంప్ తో చెఫ్ తిగిన ఫోటో కూడా ఉంది. ఇంతకీ ఆ చెఫ్ ఏం పొస్ట్ చేశాడంటే..

ట్రంప్ గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నట్లు చెఫ్ వికాస్ ఖన్నా పేర్కొన్నారు. "హలో మిస్టర్ ప్రెసిడెంట్! మేము చివరిసారి కలిసినప్పుడు మీరు వాగ్దానం చేసినట్లు వైట్ హౌస్‌లో భారతీయ వంటకాలను వండాలని ఆశిస్తున్నాను" అని ట్రంప్ తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. 2020లో అమెరికా అధ్యక్షుడి హోదాలో ట్రంప్ లో ఇండియాలో పర్యటించారు. అప్పుడు రాష్ట్రపతి భవన్‌లో డోనాల్డ్ ట్రంప్ గౌరవార్థం అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన విందు ఇచ్చారు.

An Indian chef s post to US President-elect Donald Trump is going viral

ఈ సందర్భంగా ట్రంప్ వికాస్ కన్నాతో కరచలనం చేశాడు. ఈ ఫొటోలో ప్రముఖ సంగతి ఏఆర్ రెహమాన్‌తో పలువురు ప్రముఖులు ఉన్నారు. ప్రస్తుతాని ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికే ఈ పోస్ట్ కు 60 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఖన్నా పోస్ట్ పై నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం వైట్‌హౌస్‌లో భారతీయ వంటకాలు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ గెలుపు ఇండియాకు మేలు చేస్తుందని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.

కొంత మంది ట్రంప్‌కు ఖన్నా సందేశం చూసి షాక్ అయ్యారు. కాగా వికాస్‌ ఖన్నా న్యూయార్క్‌ సిటీలో భారతీయ వంటకాలతో రుచి చూపించే ఓ రెస్టారెంట్ ఉంది. కాగా ట్రంప్ ప్రస్తుతానికి 295 ఎలక్టోరల్స్ సాధించగా.. హరీస్ 226 ఎలక్టోరల్స్ సాధించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+