న్యూజిలాండ్‌లో ఇండియన్ సాహసం

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ లో జీవనం సాగిస్తున్న ఒక ప్రవాస భారతీయుడు ప్రాణాలకు తెగించి దొంగను పరుగు పెట్టించాడు. అతని షాప్ లూటీ చెయ్యడానికి వెళ్లిన దోపిడి దొంగ దగ్గర రివాల్వర్ ఉన్నా లెక్క చెయ్యకుండా అతనితో పోరాటం చేశాడు.

ఇప్పుడు ఆ ప్రాంతంలో మన భారతీయుడు హీరో అయ్యాడు. న్యూజిలాండ్ లోని హామిల్డన్ లోని హుకనూయి రోడ్డులో భారత సంతతికి చెందిన రూపన్ పటేల్ సోంతంగా ఒక షాప్ నిర్వహిస్తున్నాడు. మంగళవారం రూపన్ పటేల్ ఒక్కడే షాప్ లో ఉన్నాడు.

ఆ సందర్బంలో ముఖానికి ముసుగు వేసుకున్న వ్యక్తి అక్కడికి వెళ్లాడు. రివాల్వర్ చూపించి నగదు ఇవ్వాలని రూపన్ పటేల్ ను బెదిరించాడు. భయపడిన రూపన్ పటేల్ క్యాష్ టేబుల్ లో ఉన్న నగదు ఇవ్వడానికి సిద్దం అయ్యాడు.

An Indian-origin businessman in New Zealand foiled a robbery attempt at his store

క్యాష్ టేబుల్ తాళం తియ్యడానికి ప్రయత్నించాడు. అయితే తాళం తెరుచుకోకపోవడంతో ఆలస్యం అయ్యింది. అప్పటి వరకు ఓపికగా ఉన్న దొంగ సహనం కొల్పోయాడు. వెంటనే క్యాష్ టేబుల్ మీదకు ఎక్కి బిగ్గరగా కేకలు వేశాడు.

దొంగ దగ్గర ఉన్న రివాల్వర్ రూపన్ చేతి సమీపంలోకి వెళ్లింది. అంతే ధైర్యం చేసి అతని దగ్గర ఉన్న రివాల్వర్ లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఇద్దరు కిందపడటంతో ఒకరి మీద ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు.

అయితే చివరికి దొంగ దగ్గర ఉన్న రివాల్వర్ రూపన్ పటేల్ చేతికి అందింది. అప్పటికే దొంగ వేసుకున్న ముసుగును రూపన్ పటేల్ చింపేశాడు. చేసేది లేక దోపిడి దొంగ అక్కడి నుండి కాలికి బుద్ది చెప్పాడు. చుట్టు పక్కల ఉన్న వ్యాపారులు రూపన్ పటేల్ ను అభినందించారు. రూపన్ పటేల్ దగ్గర రివాల్వర్ స్వాధీనం చేసుకున్న పోలీసులు దొంగ కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+