వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోరం: కొడుకుతో సహా అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి

అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ నగరంలో నివసిస్తున్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు తన మూడేళ్ల కుమారుడి సహా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్థానిక పోలీసులు వీరు నివసించే అపార్ట్ మెంట్ లోని స్వ

|
Google Oneindia TeluguNews

మిచిగాన్‌: అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పని చేస్తున్న ఓ వ్యక్తి, ఆయన కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మంగళవారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన నాగరాజు సురపల్లి మిచిగాన్‌ లోని డెట్రాయిట్‌ నగరంలో నివాసం ఉంటున్నారు. నాగరాజు స్థానిక ఇన్ఫోసిస్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తుండేవారు.

swimming pool

ఏం జరిగిందో తెలియదుగానీ, నిన్న ఆయన నివసించే అపార్ట్‌ మెంట్ స్విమ్మింగ్‌ పూల్‌లో మూడేళ్ల చిన్నారి సహా ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. వెంటనే ఎమర్జన్సీ సర్వీస్‌ కు కాల్‌ చేశారు. వారు వచ్చి పరిశీలించి ఆ మృతదేహాలు సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్ నాగరాజు‌, ఆయన కుమారుడు అనంత్‌(3)గా నిర్ధారించారు.

నాగరాజు మృతి వార్తతో గుంటూరులోని ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్విమ్మింగ్‌ పూల్‌ పక్కన చిన్నారులు ఆడుకునే చిన్న సైకిల్‌ ఉండటాన్ని గమనిస్తే.. మొదట చిన్నారి అనంత్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో పడిపోయి ఉంటాడని, కుమారుడిని కాపాడే క్రమంలో పూల్‌లో దిగిన నాగరాజు కూడా చనిపోయి ఉండొచ్చునని అపార్ట్‌ మెంట్‌ వాసులు భావిస్తున్నారు.

ఈ ఘటనపై అమెరికా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే స్విమ్మింగ్ పూల్‌ తక్కువ లోతు మాత్రమే ఉందని, ఆ లోతులో నాగరాజు చనిపోయే అవకాశాలు తక్కువేనని పోలీస్‌ అధికారి డేవిడ్‌ మోల్లాయ్‌ పేర్కొన్నారు.

English summary
A Software Engineer, Nagaraju Surapalli, a native of Guntur District of Andhra Pradesh State and his 3-year-old son Ananth found dead on Tuesday night in a swimming pool of his apartment which is located at Detroit city of Michigan State in US. Nagaraju is working here in Infosys. Police filed a case on this incident and doing their investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X