మీరు రావొద్దు: ఎయిర్ పోర్ట్‌కు వచ్చిన ఏంజెలాకు ట్రంప్ ఫోన్
జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అమెరికా పర్యటన వాయిదా పడింది. అమెరికా వెళ్లేందుకు మెర్కెల్ ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ఆఖరి నిమిషంలో డొనాల్డ్ ట్రంప్ ఆమెకు ఫోన్ చేసి రావొద్దని చెప్పారు.
వాషింగ్టన్: జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అమెరికా పర్యటన వాయిదా పడింది. అమెరికా వెళ్లేందుకు మెర్కెల్ ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ఆఖరి నిమిషంలో డొనాల్డ్ ట్రంప్ ఆమెకు ఫోన్ చేసి రావొద్దని చెప్పారు.
షెడ్యూల్ ప్రకారం డొనాల్డ్ ట్రంప్, మెర్కెల్ మంగళవారం సమావేశం కావాల్సి ఉంది. దీంతో వాషింగ్టన్ వెళ్లేందుకు మెర్కెల్ సోమవారం బెర్లిన్‌లోని ఎయిర్ పోర్టుకు బయల్దేరారు. మరికాసేపట్లో ఎయిర్ పోర్టుకు చేరుకుంటారనగా ట్రంప్ ఆమెకు ఫోన్ చేసి అమెరికా రావొద్దని కోరారు.
ఈ విషయాన్ని మెర్కెల్ మీడియాకు చెప్పారు. ప్రస్తుతం అమెరికాలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని, అందుకే రావొద్దని చెప్పినట్లు ఆమె తెలిపారు.

అయితే అప్పటికే మెర్కెల్ పార్టీకి చెందిన కొందరు నేతలు, మీడియా వ్యక్తులు విమానంలో కూర్చున్నారు. దీంతో ఆమె నేరుగా విమానాశ్రయానికి వెళ్లి జరిగిన విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
వైట్ హౌస్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ప్రస్తుతం అమెరికాలో తుఫాను ఏర్పడిందని, దీని వల్ల కొన్ని విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొంది. మెర్కెల్ పర్యటన శుక్రవారం నాటికి వాయిదా వేసినట్లు శ్వేతసౌధం తెలిపింది.
గతంలో కూడా మెర్కెల్ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. 2010లో మెర్కెల్ అమెరికా పర్యటనలో ఉండగా ఐస్లాండ్‌లో అగ్నిపర్వతం బద్ధలైంది. భారీ పొగలు వ్యాపించడంతో మెర్కెల్ తిరుగు ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. దీంతో పోర్చుగల్, ఇటలీ మీదుగా ఆమె జర్మనీ చేరుకోవాల్సి వచ్చింది.
-
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
ఖమేనీ సంధి ఒప్పందం? -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్












Click it and Unblock the Notifications