Viral Video: మాస్కు మర్చిపోయి పరుగుపెట్టిన ఏంజెలా మెర్కెల్, గ్రేట్ లీడర్ అంటూ నెటిజన్లు

బెర్లిన్: కరోనా మహమ్మారి సామాన్య ప్రజలతోపాటు దేశాధినేతలను కూడా వణిస్తోంది. అందుకే పదే పదే ప్రజలకు కరోనా నిబంధనలను పాటించాలని చెబుతున్నారు. మాస్కులు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. అయితే, తాజాగా, జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ తన మాస్కును మర్చిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

పార్లమెంటులో ప్రసంగించిన అనంతరం ఏంజిలా మెర్కెల్ తన సీటులో వచ్చి కూర్చున్నారు. అయితే, ఆమెకు అప్పుడే ఏదో మర్చిపోయానని గుర్తుకు వచ్చింది. తన మాస్కు అక్కడే మార్చిపోయానని వెంటనే అక్కడకి వెళ్లి తన మాస్కును తెచ్చుకున్నారు. అప్పుడు ఆమె చూపిన అప్రమత్తతే ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

Angela Merkel panics as she forgets her face mask during parliament session

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మెర్కెల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆదర్శ నేత అంటూ పొగుడుతున్నారు. మరికొందరు మర్చిపోవడం మానవ సహజం.. తాము కూడా ఇలా మాస్కును మర్చిపోతున్నామని చెప్పుకొస్తున్నారు.

ఏంజెలా మెర్కెల్ తన మాస్కును మర్చిపోయి భయాందోళనకు గురయ్యారంటూ రౌటర్స్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఈ వీడియోను ఇప్పటికే మిలియన్ల మంది వీక్షించారు. అనేక మంది షేర్లు చేస్తున్నారు. ఏంజెలా మెర్కెల్ దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచారని, కరోనా కట్టడిలో మాస్కు ప్రాధాన్యతను స్పష్టం చేశారని నెటిజన్లు కొనియాడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+