నో ప్లైజోన్ ప్రకటించండి.. లేదా.. యుద్ధ విమానాలను అందించండి !! : యూఎస్ కాంగ్రెస్‌కు జెలెన్ స్కీ విజ్ఞప్తి
ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతోంది. వైమానిక దాడులతో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా దురాక్రమణపై అమెరికా పార్లమెంటు ఉభయ సభల నుద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక ప్రసంగం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇలాంటి భయాందోళనకరమైన సంఘటల్ని ఎన్నడూ చూడలేదన్నారు. రష్యా దాడులను 1941 డిశంబర్ 7న పెరల్ హార్బర్‌పై జరిగిన దాడులతో పోల్చారు. అంతేకాదు న్యూయార్క్, పెన్సిల్వేనియా, వాషింగ్టన్ లపై 2001 సెప్టెంబర్ 11న జరిగిన దాడులను గుర్తుచేస్తున్నాయని తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా ఇదే తరహాలో గత 21 రోజుల నుంచి దాడులు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రష్యా దాడులకు బెదిరేదిలేదు..
ఉక్రెయిన్‌లో నివాస ప్రాంతాలు, ఆస్పత్రులను టార్గెట్ చేస్తూ రష్యా బాంబులతో దాడులు చేస్తోందని జెలెన్‌స్కీ యూఎస్ కాంగ్రెస్ సభ దృష్టికి తీసుకువచ్చారు . ఈ దాడుల్లో అమాయక ప్రజలు , చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని సంబంధించిన వీడియోను వారికి చూపిస్తూ వివరించారు. రష్యా మిస్సైల్స్, వైమానిక దాడులకు తాము బెదరడం లేదు. వెనకడుగువేయడంలేదని స్పష్టం చేశారు. మాస్కోపై తమ పోరాటం కేవలం తమ దేశాన్ని కాపాడుకొనేందుకే కాదు.. ప్రపంచ విలువల కోసం చేస్తున్నామని తెలిపారు. తమ దేశ గగనతలాన్ని మృత్యముఖంగా రష్యా మారుస్తోందని ఆవేదన వెల్లబుచ్చారు.

యుద్ధ విమానాలు అందించండి.
రష్యా దురాక్రమణలను సమర్ధవంతంగా ఎదుర్కొంటామన్నారు. తమ దేశాన్ని కాపాడుకునేందుకు సాయం అందించాలని అమెరికా పార్లమెంటుకు జెలెన్ స్కీ విజ్ఞప్తి చేశారు. ఆర్థిక సహాయంతో పాటు యుద్ధవిమానాలను, ఆయుధ సామాగ్రిని అందించాలని కోరారు . అన్ని రకాలుగా సాయం అందిస్తున్న అమెరికా ప్రభుత్వానికి, ప్రజలకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. రష్యా యుద్ధాన్ని నిలిపివేసే వరకు ఆ దేశంపై మరిన్ని ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉందన్నారు.తమ దేశ విలువులు, స్వేచ్ఛగా జీవించే హక్కులపై రష్యా అత్యంత కిరాతంగా దాడులుకు తెగబడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Recommended Video


జెలెన్ స్కీకి స్టాండింగ్ ఒవేషన్
ఉక్రెయిన్‌పై నో-ప్లై జోన్‌గా ప్రకటించాలని అమెరికా పార్లమెంటు వేదికగా జెలెన్ స్కీ మరోసారి కోరారు. లేదా రష్యా దాడులను ధీటుగా తిప్పికొట్టేందుకు యుద్ధ విమానాలనైనా తక్షణం అందించాలని కోరారు. నో -ప్లై జోన్ ప్రకటిస్తే .. రష్యా దాడులు చేస్తున్న నగరాల్లో ఉన్న పౌరులను ఖాళీ చేయిందేందుకు వీలుగా ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు ఉక్రెయిన్ పై 1000కి మిస్సైల్స్ ను రష్యా దళాలు పేల్చాయని యూఎస్ కాంగ్రెస్ సభ వివరించారు. రష్యా దాడులతో ద్వంసమైన నగరాలలో పరిస్థితులను తెలిపారు. దాదాపు 20 నిమిషాలు పాటు జెలెన్ స్కీ ప్రసంగించారు. ఈసందర్భంగా అమెరికా పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు చప్పట్లతో జెలెన్ స్కీకి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications