మరోసారి క్రూరత్వం చాటుకున్న కిమ్... నిర్దాక్షిణ్యంగా ఆ దంపతుల ఉరితీత.. ఉలిక్కిపడ్డ ఉత్తర కొరియా..
ఆధునిక నియంతల్లో తనను మించినవారు లేరని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇప్పటికీ ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. ఆ దేశానికి సంబంధించి ఏ వార్త బయటకొచ్చినా.. అది కిమ్ నియంత్రుత్వానికో,క్రూరత్వానికో ముడిపడి ఉంటుంది. తాజాగా ఉత్తర కొరియాకు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ వెలుగుచూసింది. ఇటీవల దేశం దాటి పారిపోయేందుకు యత్నించిన ఓ జంటను సైన్యం ఉరితీసింది. ఇంతకీ ఆ జంటను ఎందుకు పారిపోవాలనుకున్నారు.. అసలేం జరిగింది..
Recommended Video

ఇదీ జరిగింది...
ఉత్తర కొరియాలోని ర్యాంగాంగ్ ప్రావిన్స్‌కు చెందిన 50ఏళ్ల భార్యాభర్తలు ఇద్దరు ఇటీవల రహస్యంగా దేశ సరిహద్దును దాటి చైనాలోకి పారిపోవాలనుకున్నారు. తమతో పాటు మేనల్లుడు(14)ని కూడా వెంట తీసుకెళ్లారు. చైనా బోర్డర్‌లోకి ప్రవేశించాక.. అక్కడి నుంచి సౌత్ కొరియా వెళ్లి.. అక్కడ నివాసం ఉంటున్న తన సోదరుడి కుటుంబాన్ని కలుసుకోవాలని ఆమె భావించింది. తద్వారా తన మేనల్లుడిని తిరిగి అతని కుటుంబంతో కలపాలని చూసింది. ఆమె సోదరుడు కూడా కొంత కాలం క్రితమే ఉత్తర కొరియా నుంచి పారిపోయి దక్షిణ కొరియాలో స్థిరపడ్డాడు. అయితే అతని కొడుకు మాత్రం ఇక్కడే ఉండిపోవడంతో అప్పటినుంచి అతని బాగోగులు వారే చూస్తున్నారు. ఇటీవల కరోనా వైరస్ కారణంగా వ్యాపారంలో నష్టాలు కూడా రావడంతో దేశం విడిచి వెళ్లిపోవాలనుకున్నారు.

దంపతుల ఉరితీత...
అనుకున్నట్టుగానే మేనల్లుడిని వెంట పెట్టుకుని రహస్యంగా ర్యాంగాంగ్‌లోని చైనా సరిహద్దు వద్దకు ఆ దంపతులు చేరుకున్నారు. అక్కడి నుంచి యాలు నదిని దాటి చైనాలోకి ప్రవేశించాలనుకున్నారు. కానీ ఇంతలోనే బోర్డర్ సెక్యూరిటీ వారిని పట్టుకున్నారు. అనంతరం వారిని చిత్ర హింసలకు గురిచేయడంతో నిజం ఒప్పుకున్నారు. తల్లిదండ్రుల నుంచి వేరైన తమ మేనల్లుడిని తిరిగి వారి చెంతకు చేర్చేందుకే వెళ్తున్నామని,అంతే తప్ప మరో ఉద్దేశం లేదని వారు చెప్పారు. అయినప్పటికీ సైన్యం వారిని కనికరించలేదు. ఫైరింగ్ స్క్వాడ్ వారిని ఉరితీసింది. బాలుడు మైనర్ అన్న కారణంగా అతన్ని మాత్రం ఉరితీయకుండా లేబర్ క్యాంపుకు తరలించారు.

ఉలిక్కిపడ్డ ఉత్తర కొరియా ప్రజలు..
నిజానికి నేరమేదైనా ముందుగా నిందితులను లేబర్ క్యాంపుకు తరలించడం ఉత్తరకొరియాలో సాధారణం. ఆ తర్వాతే శిక్షలను నిర్దారిస్తారు. కానీ అందుకు విరుద్దంగా ఈ జంటను ఉరితీయడం ఉత్తర కొరియా జనాలను ఉలిక్కి పడేలా చేసింది. ప్రస్తుతం ఉత్తర కొరియాలో కరోనా వైరస్ కారణంగా కిమ్ జోంగ్ ఉన్ ఎమర్జెన్సీ విధించారు. ఇదే అదనుగా భావించి ఎవరైనా పారిపోయేందుకు ప్రయత్నిస్తే.. కఠిన చర్యలు తీసుకోవాలని సైన్యాన్ని ఆదేశించారు. ఉత్తర కొరియాలో ఇలా దేశం దాటి పారిపోయేందుకు యత్నించి సైన్యం చేతిలో హతమైన వాళ్లు కోకొల్లలు. రహస్యంగా దేశం దాటించేందుకు కొంతమంది బ్రోకర్స్ కూడా పనిచేస్తుంటారు. అందుకోసం వారికి భారీ స్థాయిలో డబ్బు ముట్టజెప్పాల్సి ఉంటుంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications