అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు ఘటన చోటు చేసుకుంది. లాస్ఏంజెల్స్‌లో కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు ఘటన చోటు చేసుకుంది. లాస్ఏంజెల్స్‌లో కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాలిఫోర్నియాలో ఒక్క నెలలో కాల్పుల ఘటనలు చోటు చేసుకోవడం ఇది నాలుగోసారి కావడం ఆందోళన కలిగిస్తోంది.

అమెరికా కాలమానం ప్రకారం.. శనివారం తెల్లవారుజామున ఈ కాల్పులు జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కాల్పులకు గురైన వారిలో ముగ్గురు వాహనంలో ఉన్నారని, వీరంతా మృతి చెందారని పోలీసులు చెప్పారు. అయితే, కాల్పులకు ఎవరు పాల్పడ్డారో ఇంకా తెలియదని తెలిపారు.

 Another firing incident in america: three killed, few injured in california shooting

కాల్పుల ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. కాగా, గతవారం లాస్ఏంజెల్స్ లో ని డ్యాన్స్ హాల్ వద్ద జరిగిన కాల్పుల్లో 11 మంది మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. ఆ తర్వాత శాన్‌ఫ్రాన్సిస్కిలో జరిగిన కాల్పుల్లో ఏడుగురు మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు. అమెరికాలో గత మూడేళ్ల కాలంలో 600 సార్లు కాల్పుల ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హ. ఈ ఘటనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇటీవల అమెరికాలో నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో ఓ తెలుగు విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. వరుసగా జరుగుతున్న కాల్పుల ఘటనలతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+