అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి, అసభ్య చిత్రాలు
వాషింగ్టన్: అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. ఓల్డ్ లేక్ హైలాండ్స్‌లోని హిందూ దేవాలయంపై కొంతమంది దుండగులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆ దుండగులు హిందూ దేవాలయంపై దాడి చేయడమే కాకుండా అసభ్యకరమైన చిత్రాలను అంటించారు. దీనిపై దేవాలయ బోర్డులో పని చేస్తున్న కృష్ణ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తమ దృష్టికి గత సోమవారం వచ్చినట్లు పేర్కొన్నారు.

ఈ తరహా సంఘటన నిజంగా బాధాకరమని కృష్ణ సింగ్ తెలిపారు. ఇది మొత్తం ఒక జాతినే అవమానపరిచే చర్యగా ఆయన అభివర్ణించారు. దేవాలయ బోర్డ్ ఫిర్యాదు మేరకు ఆ దుండుగుల కోసం డల్లాస్ పోలీసులు, డిటెక్టివ్ ఏజెన్సీలతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా, ఇలాంటి దాడులు జరగకుండా పలువురు భక్తులు ఆలయానికి ఫెన్సింగ్‌తో కూడిన ప్రహారీని నిర్మిస్తున్నారు. హిందువులు, హిందువేతరులు కూడా దేవాలయ పునర్నిర్మాణానికి సహకరిస్తామని ముందుకు వచ్చారు.
గత మూడు నెలల్లో అమెరికాలో హిందూ దేవాలయాలపై దాడి జరగడం ఇది మూడోసారి. ఇదే తరహా ఘటన గడిచిన ఫిబ్రవరి 15న సియాటెల్ ప్రాంతంలోని దేవాలయం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దేవాలయ గోడపై స్వస్తిక్ రాసి ‘గెట్ ఔట్' అనే పదాలను రాశారు.












Click it and Unblock the Notifications