కూలిపోయిన మరో విమానం: 116మంది మృతి, సిబ్బంది

వెస్ట్ ఆఫ్రికాలోని బుర్కియా ఫాసోలో విమానం టేకాఫ్ అయిన యాభై నిమిషాల తర్వాత సంబంధాలు కోల్పోయింది.
ఎయిర్ అల్జీర్స్ ఏహెచ్ 5017 విమానం టేకాఫ్ అయిన యాభై నిమిషాల అనంతరం అదృశ్యమైందని, దాంతో సంబంధాలు తెగిపోయాయని ఏవియేషన్ అధికారులు చెప్పారు. ఈ ఎయిర్ అల్జీర్స్ విమానంలో 110 మంది ప్రయాణీకులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆరుగురు క్రూ నెంబర్స్ ఉన్నారు. మొత్తం 116 మంది ఉన్నారు. ఇది కూలిపోయింది.
వాతావరణం బాగాలేదని, దిశ మార్చుకోవాలని పైలట్‌కు సూచించారు. ఈ సూచన అనంతరం విమానంతో సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత ఇది కూలిపోయినట్లుగా గుర్తించారు. ఈ విమానం నైజర్ నదిలో కూలిపోయింది.












Click it and Unblock the Notifications