వరుసగా రెండో ఏడాది అంటార్కిటికాలో భారీగా కరిగిన మంచు
సిడ్నీ: అంటార్కిటికాలో వరుసగా రెండో ఏడాది మంచు భారీగా కరిగిపోయింది. మంచు పొర విస్తీర్ణం రికార్డుల పరంగా రెండో అత్యల్పస్థాయికి పడిపోయింది.
ఆస్ట్రేలియన్ అంటార్కిటిక్ డివిజన్(ఏఏడీ) ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. గత నెలలో అంటార్కిటికాలో మంచు విస్తీర్ణం 21.5 లక్షల చ.కి.మీ.కు పరిమితమైనట్లు తెలిపింది.

ప్రస్తుత వేసవిలో ఇదే కనిష్ఠమని తెలిపింది. మొత్తం వేసవి సీజన్ల పరంగా చూస్తే ఇది రెండో అతి తక్కువ విస్తీర్ణమని తెలిపింది. గత ఏడాది మార్చిలో అత్యల్పంగా 20.7 లక్షల చ.కి.మీ. విస్తీర్ణానికి మంచు పొర పరిమితమైందని తెలిపింది.












Click it and Unblock the Notifications