Claude AIతో అమెరికాకు చుక్కలు చూపిస్తున్న ఇరాన్, హౌతీలు-షాకింగ్ రిపోర్ట్స్..!
ప్రపంచ దేశాల మధ్య సాగుతున్న యుద్దాల్లో ఇప్పుడు కృత్రిమ మేథ కీలకంగా మారిపోయింది. ముఖ్యంగా ఏఐ ప్లాట్ ఫామ్స్ ను వాడుకుని యుద్దాలు చేసే స్థాయికి ఇది అభివృద్ది చెందింది. ఇందులో ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ అందరి కన్నా ముందుంది. దీన్ని వాడుకుంటూ ఇరాన్ తో పాటు దానికి అండగా ఉన్న గ్రూపులు అమెరికాను అన్ని విధాలుగా టార్గెట్ చేస్తున్నాయి. దీంతో చాలా సులువుగా అమెరికా వారికి టార్గెట్ గా మారిపోతోంది, అంతే కాదు యుద్దంలో భారీ నష్టాలు చవిచూస్తోంది.
అమెరికా నౌకాదళాన్ని హార్ముజ్ జలసంధి సమీపంలో లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడానికి ఇరాన్ అనుకూల శక్తులు, అలాగే అత్యాధునిక క్షిపణుల అభివృద్ధి కోసం యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రముఖ ఏఐ ల్యాబ్ ఆంత్రోపిక్ (Anthropic) సంస్థకు చెందిన క్లాడ్ ఏఐ (Claude AI) మోడల్‌ను నిఘా సేకరణ కోసం ఉపయోగించినట్లు వెల్లడైంది. ఈ మేరకు ఆంత్రోపిక్ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్‌కు చెందిన హ్యాకర్ల బృందం క్లాడ్ ఏఐ సాయంతో అత్యంత కీలకమైన భద్రతా సమాచారాన్ని సేకరించింది. అమెరికా యుద్ధనౌకలకు సంబంధించిన లొకేషన్లు, వాటి దిశలను ట్రాక్ చేయడానికి పబ్లిక్‌గా లభ్యమయ్యే ఓపెన్-సోర్స్ సమాచారాన్ని విశ్లేషించి టార్గెటింగ్ హ్యాండ్‌బుక్స్ తయారు చేసింది. అంతేకాకుండా, సైనికుల అధికారిక ఫోటోల కింద ఉన్న విజువల్ క్యాప్షన్ల నుంచి సిబ్బంది వ్యక్తిగత వివరాలను సేకరించడం, యుద్ధనౌకల్లో వాడే సిస్కో కమ్యూనికేషన్ వ్యవస్థలు, సముద్ర ఉపగ్రహ టెర్మినల్స్‌లోని సాంకేతిక లోపాలను ఈ ఏఐ మోడల్ ద్వారా విశ్లేషించారు.

మరోవైపు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు క్లాడ్ ఏఐ మోడల్‌ను కేవలం సమాచార సేకరణ కోసమే కాకుండా, క్షిపణి వ్యవస్థల తయారీ రంగంలోనూ వాడారు. దాదాపు 2వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధి గల మల్టీ-స్టేజ్ బాలిస్టిక్ క్షిపణులు, హైపర్సోనిక్ గ్లైడ్ వాహనాల నియంత్రణకు అవసరమైన కోడింగ్‌ను క్లాడ్ ఏఐ ద్వారా రూపొందించారు. విమాన ప్రయాణ గమనాన్ని మార్చే ఆటోపైలట్ సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయడానికి, ఇంజనీర్ల ప్రమేయం లేకుండా సరికొత్త కోడింగ్ రాయడానికి ఈ సాంకేతికతను వాడారు. వీరితో పాటు ఇరాన్‌కు చెందిన మరో సాంస్కృతిక సంస్థ కూడా అయతొల్లా అలీ ఖమేనీ మరణానంతర వారసత్వ ప్రణాళికలు, అంత్యక్రియల ఏర్పాట్లకు సంబంధించిన అంతర్గత బ్లూప్రింట్లను విశ్లేషించడానికి క్లాడ్ ఏఐని వాడింది. తాజా నివేదిక ప్రకారం, ఈ ఏఐ ద్వారా హౌతీలు క్షిపణి ప్రయోగాన్ని కూడా ఒకసారి పరీక్షించారని, అయితే అది విఫలమైనప్పటికీ వాటి వైఫల్య కారణాలను అన్వేషించడానికి తిరిగి ఏఐ మోడల్‌నే ఉపయోగించినట్లు తేలింది. ఈ గూఢచర్య కార్యకలాపాలు బయటపడటంతో ఆంత్రోపిక్ సంస్థ స్పందించి తక్షణ చర్యలు తీసుకుంది. ఇరాన్, యెమెన్, చైనా, రష్యాలకు చెందిన ఆరు రకాల ముప్పు కలిగించే నిఘా సంస్థల ఖాతాలను గుర్తించి బ్లాక్ చేసింది.














Click it and Unblock the Notifications
