Canada: కెనడాలో ఖలిస్థాన్ వ్యతిరేక, మద్దతుదారుల నిరసనలు..

కెనడాలో ఖలిస్థాన్ మద్దతు దారులు, భారత మద్దతుదారులు పోటాపోటీగా నిరసన తెలిపారు. తాజాగా కెనడాలోని భారతీయ దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఒక పోస్టర్ గ్రేటర్ టొరంటో ఏరియా (జిటిఎ)లోని ఒక ఆలయం వెలుపల కనిపించింది. ఈ పోస్టర్ ఖలిస్థాన్ అనుకూలంగా ఉంది. బ్రాంప్టన్‌లోని భారత్ మాతా మందిర్ వెలుపల "వార్ జోన్" పేరుతో ఉన్న పోస్టర్ స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున ఉంచబడింది మరియు ఉదయం ఆలయ వాలంటీర్లు కనుగొన్నారు. ఆ తర్వాత పోస్టర్‌ను తొలగించినట్లు ఆలయ అధికారి ఒకరు హెచ్‌టీకి తెలిపారు.

శుక్రవారం జిటిఎలోని ఇతర ప్రదేశాలలో కూడా ఇలాంటి పోస్టర్లు కనిపించాయని అధికారులు తెలిపారు. జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలోని గురునానక్ సిక్కు గురుద్వారా పార్కింగ్ స్థలంలో హత్యకు గురైన ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్, నిషేధిత ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ పేరిట ప్రతిపాదిత "ఖలిస్తాన్ ఫ్రీడమ్ ర్యాలీ" నిర్వహిస్తునారు. మరోవైపు ఖలిస్థాన్ మద్దతు దారులు ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో భారత కాన్సులేట్ వద్ద భద్రత పెంచారు.

Anti-Khalistan and pro-Khalistan protests held in Canada

గత కొన్ని రోజులుగా ఖలిస్థాన్ అనుకూల గ్రూపుల కార్యకలాపాలపై కెనడా వ్యవహరిస్తున్న తీరుపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కెనడా రాయబారి కామెరాన్ మాకే జూలై 3న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పిలిపించారు. భారత దౌత్యవేత్తలకు ముప్పుపై చర్చించారు. "మా దౌత్యవేత్తలు, విదేశాలలో ఉన్న మా దౌత్య ప్రాంగణాలపై హింసను ప్రేరేపించే ఈ పోస్టర్లు ఆమోదయోగ్యం కాదు. మేము వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాము" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం అన్నారు.

అటు లండన్ లో కూడా భారత హైకమిషన్ వెలుపల ఖలిస్థాన్ మద్దతుదారులు నిరసన తెలిపారు. ర్యాలీలో భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి, బర్మింగ్‌హామ్‌లోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ శశాంక్ విక్రమ్ చిత్రాలతో హింసను ప్రేరేపించే పోస్టర్‌లను ప్రదర్శించారని వార్తలు వస్తున్నాయి. ఖలిస్తానీ తీవ్రవాదుల భారత వ్యతిరేక దాడులు, పోస్టర్ల మధ్య లండన్‌లోని భారత హైకమిషన్‌పై ఎటువంటి ప్రత్యక్ష దాడులు ఆమోదయోగ్యం కాదని UK ప్రభుత్వం ప్రకటించింది. UK, కెనడా, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్‌తో సహా పలు దేశాలలో ఖలిస్తానీ అనుకూల గ్రూపుల నిరసనలు తెలుపుతుండడం ఆందోళనకర అంశమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+