మేం అలా వెళ్లలేం: డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ మీద షాక్

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి షాక్ తగిలింది. ముస్లీం మెజార్టీ కలిగిన ఏడు దేశాల పౌరులపై ఆంక్షలను 9వ సర్క్యూట్‌ అమెరికా అప్పీల్‌ కోర్టు తోసిపుచ్చింది.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి షాక్ తగిలింది. ముస్లీం మెజార్టీ కలిగిన ఏడు దేశాల పౌరులపై ఆంక్షలను 9వ సర్క్యూట్‌ అమెరికా అప్పీల్‌ కోర్టు తోసిపుచ్చింది.

ముస్లిం దేశాల పౌరుల ఆంక్షలపై ట్రంప్‌ ఆదేశాలను పునరుద్ధరించేందుకు అప్పీల్‌ కోర్టు నిరాకరించింది. దీంతో ఈ ఏడు దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించే అవకాశం కలిగింది. జాతీయ భద్రత కోసం తక్షణమే కోర్టు తన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం చేసిన వాదనను అప్పీల్‌ కోర్టులోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం తిరస్కరించింది.

దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వెళ్లలేమని జడ్జిలు 29 పేజీల రూలింగ్‌లో తెలిపారు.

Appeals Court Deals New Blow To Donald Trump's Travel Ban Targeting Muslims

జాతీయ భద్రతకు ముప్పు ఉన్న కారణంగా వెంటనే ఏడు ముస్లిం దేశాలపై నిషేధం పునరుద్ధరించాలని ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ చేసిన వాదనపై సరైన సాక్ష్యాధారాలు అందించలేకపోయినందున కోర్టు వారి వాదనను తోసిపుచ్చింది.

దీనిపై డొనాల్డ్ ట్రంప్‌ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. మన దేశ భద్రతకు ముప్పు ఉందని, కోర్టులో చూసుకుందామని పేర్కొన్నారు.

ట్రంప్‌ నిషేదాజ్ఞలను నిలిపివేస్తూ సియాటిల్‌ జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ అమెరికా న్యాయశాఖ శాన్‌ఫ్రాన్సిస్‌కోలోని తొమ్మిదో సర్క్యూట్‌ అప్పీళ్ల న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే పూర్తిస్థాయి విచారణ నిర్వహించకుండా జిల్లా కోర్టు ఆదేశాలను నిలిపివేయలేమని అప్పీళ్ల కోర్టు గతంలో వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+