Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భాగస్వాములకూ వర్క్ పర్మిట్ వీసాలు ఇవ్వండి: ట్రంప్‌కు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్

వాషింగ్టన్: అమెరికాలో సాంకేతిక రంగంలో హెచ్1బి వీసాతో పని చేస్తున్న వృత్తి నిపుణులు.. తమ జీవిత భాగస్వాములకు వర్క్ పర్మిట్లు జారీ చేయాలని ట్రంప్ ప్రభుత్వాన్ని కోరారు. పలు టెక్నాలజీ ట్రేడ్‌ గ్రూపులు ఈ మేరకు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాయి.

ఒబామా హయాంలోని హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు కూడా చట్టప్రకారం పని చేసుకోగలిగేలా ఉన్న నిబంధనను అలాగే కొనసాగించాలని ట్రేడ్‌ గ్రూపులు కోరుతున్నాయి.

Apple, Microsoft, Google ask Trump to retain Obama-era rule on H-1B visa

యాపిల్, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ తదితర ప్రముఖ కంపెనీలు ఈ గ్రూపుల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఐటీ ఇండస్ట్రీ కౌన్సిల్‌, యూఎస్ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, బీఎస్‌ఏ-ద సాఫ్ట్‌వేర్‌ అలయన్స్‌ సహా తదితర గ్రూపులు అమెరికా పౌరసత్వ, వలసల సేవల విభాగానికి ఈ మేరకు లేఖలు రాశాయి.

హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు పని అనుమతి కల్పించే హెచ్ 4 ప్రోగ్రాంను అలాగే ఉంచాలని అభ్యర్థించాయి. ఈ హెచ్ 4 నిబంధనను చాలామంది భారతీయులు ఉపయోగించుకుంటున్నారు. అమెరికన్లకు ఉద్యోగాలను పెంచడం కోసం ట్రంప్‌ యంత్రాంగం హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు పని అనుమతి తొలగించాలని భావిస్తున్న నేపథ్యంలో టెక్నాలజీ ట్రేడ్‌ గ్రూపులు ఈ అభ్యర్థన చేశాయి.

హెచ్ 4 నిబంధనను ఎక్కువగా మహిళలే ఉపయోగించుకుంటున్నారని, దీన్ని తీసేస్తే వారు అనిశ్చితిలో పడిపోతారని, వారిని పని చేసుకోకుండా నియంత్రించినట్లవుతుందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+