హంతకుడి ఫోన్ హ్యాక్: కోర్టు ఆదేశాలకు యాపిల్ ‘నో’
న్యూయార్క్: ఓ హంతకుడి ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ నిరాకరించింది. గత సంవత్సరం కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలో కాల్పులకు పాల్పడి 14మంది మృతికి కారణమైన సయీద్ రిజ్వాన్ ఫారూఖ్ ఫోన్‌ను అన్‌లాక్ చేసి ఎఫ్‌బీఐ దర్యాప్తు అధికారులకు సహకరించాలని అమెరికాలోని ఓ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే దీనికి యాపిల్ సంస్థ విముఖత వ్యక్తం చేసింది. దీనిపై సంస్థ సీఈవో టిమ్ కుక్ మాట్లాడుతూ.. ‘యూఎస్ ప్రభుత్వం ఓ అసాధారణమైన పని చేసి ఎఫ్‌బీఐకి సహకరించాలని కోరుతోంది. దీనివల్ల మా కస్టమర్ల భద్రత చిక్కుల్లో పడుతుంది. దీనిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తామ'ని చెప్పారు.

2014 నుంచి వచ్చిన అధునాతన ఫోన్లలో డిఫాల్ట్ ఆటో ఎన్‌క్రిప్షన్ ఆప్షన్ ఆన్ చేసి ఉంటే సమాచారం నేరుగా భద్రపర్చుకునే అవకాశం ఉంటుంది. దీనిని చూడాలంటే కచ్చితంగా కోడ్ తెలిసి ఉండాలి. ఒక వేళ 10 సార్లు తప్పు కోడ్ వాడితే భద్రపర్చిన సమాచారం మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. తమ సిబ్బంది కూడా దీనిని తెరవలేరని యాపిల్ సంస్థ స్పష్టం చేసింది.
ఫరూఖ్ ఫోన్‌కు ఎన్నిసార్లు తప్పు కోడ్ ఇచ్చినా డేటా పోకుండా ఉండే అవకాశం కల్పించాలని ఎఫ్‌బీఐ యాపిల్‌ను కోరింది. కాగా, ఫరూఖ్ నాలుగు అంకెల కోడ్ వాడి ఉంటాడని భావిస్తున్నారు. దీని కోసం దాదాపు 10000 కాంబినేషన్లను వాడాల్సి ఉంటుంది.
కాగా, గత డిసెంబర్ 2న సయీద్ ఫరూక్, తష్ఫిన్ మాలిక్ దంపతులు సాన్ బెర్నార్డినోలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 14 మంది మృతికి కారణమై.. పోలీసుల కాల్పుల్లో హతమైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications