నిరసన: జెండా దించి! నెక్కర్ ఎగరేశారు(వీడియో)
ప్రేగ్: చెక్ దేశాధ్యక్షుడి తీరును తీవ్రంగా వ్యతిరేకించిన ఓ గ్రూపు ఆందోళనకారులు తమ వినూత్న నిరసనతో కటకటాలపాలయ్యారు. వారు అధ్యక్ష భవంతిపైకి ఎక్కి.. అక్కడి జెండాను తొలగించి.. దాని స్థానంలో భారీ ఎర్రరంగు అండర్‌ప్యాంట్(షార్ట్/నెక్కర్)ను ఎగరేశారు.
చైనా, రష్యాలతో అనారోగ్యకర సంబంధాలు నెలకొల్పుకున్నారని ఆరోపిస్తూ చెక్ అధ్యక్షుడు మిలోస్ జెమన్ వ్యతిరేకులు ఈ చర్యకు పాల్పడ్డారు. ‘దేనికీ సిగ్గుపడని ఒక మనిషి జెండా ఇప్పుడు ప్రేగ్ క్యాజిల్‌పై ఎగురుతోంది' అని జ్టోహొవెన్ గ్రూప్ ఆందోళనకారులు తమ వెబ్‌సైట్‌లో, ఫేస్‌బుక్ పేజీలో పేర్కొన్నారు.
చిమ్నీని శుభ్రం చేసేవారి దుస్తుల్లో శనివారం మధ్యాహ్నం అధ్యక్ష అధికార భవంతిని ఎక్కిన ముగ్గురు వ్యక్తులు.. దానిపై ఉన్న జెండా తొలగించారు. దాని స్థానంలో ఎర్ర రంగులో ఉన్న భారీ షార్ట్‌ను ఎగరేశారు.
కాగా, షార్ట్ ఎగరేసిన వారిని అరెస్టు చేశామని, వారి చర్యకు గాను రెండేళ్లు ఖైదు విధించే అవకాశముందని పోలీసులు తెలిపారు.
2007 జూన్‌లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. చెక్ అధికార టెలివిజన్ కార్యాలయంలో చొరబడిన వీరు.. ఉదయం పూట వాతావరణ బులెటిన్‌లో ప్రశాంతమైన నేలపై అణు విస్ఫోటన దృశ్యాన్ని ఉంచి ప్రసారం చేశారు. అదే సంవత్సరం ప్రేగ్ నగరంలో దాదాపు 50 ట్రాఫిక్ సిగ్నల్ లైట్లపై ఛాయాచిత్రాలు అంటించారు.












Click it and Unblock the Notifications