‘సంబంధాల గుట్టు రట్టు’: దంపతుల ఆత్మహత్యలు
టొరంటో: వివాహేతర సంబంధాలకు వేదికగా పని చేస్తున్న అష్లే మాడిసన్ వెబ్‌సైట్ వినియోగదారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మాడిసన్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన హాకర్లు అక్రమ సంబంధాల గుట్టు రట్టు చేయడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్న వెబ్‌సైట్ ఖాతాదారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
అష్లే మాడిసన్ వెబ్‌సైట్‌పై హ్యాకర్లు దాడి చేసి అందులో అక్రమ సంబంధాలు నెరపుతున్నవారి సమాచారాన్ని తస్కరించిన విషయం తెలిసిందే. తమకు కోరినంత డబ్బు ఇవ్వాలని, లేకుంటే ఆ సమాచారాన్ని లీక్ చేస్తామని హ్యకర్లు బెదిరింపులకు దిగారు. దీంతో వారు కోరినంత మొత్తము ఇవ్వలేమని సదరు వెబ్‌సైట్ చేతులెత్తేసింది.

కాగా, ఆ వెబైసైట్లో అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్న వారి పేర్లను విడతల వారీగా హ్యాకర్లు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు ఇలా 3 కోట్ల అక్రమ సంబంధాల గుట్టు విప్పినట్లు అంచనా. దీనికి అష్లే మాడిసన్ వినియోగదార్లు తమ కొంప కొల్లేరు అవుతుందని లబోదిబోమంటున్నారు.
కొందరు జీవిత భాగస్వాముల దగ్గర ముఖం చెల్లక తీవ్ర మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పరిస్థితి చేయి దాటిపోంతుందని తలచిన పోలీసులు హ్యాకర్లను పట్టుకునే పనిలో పడ్డారు. అటు అష్లే మాడిసన్ వెబ్‌సైట్ మాతృ సంస్థ అవిద్ లైఫ్ మీడియా కూడా రంగంలోకి దిగింది.
హ్యాకర్లను పట్టిచ్చిన వారికి రెండున్నర కోట్ల రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించింది. అష్లే మాడిసన్ వెబ్‌సైట్ ‘ఈ జీవితం చిన్నది.. ఎఫైర్ పెట్టుకో' అనే నినాదంతో ఆన్‌లైన్ డేటింగ్ వెబ్‌సైట్‌గా పని చేస్తోంది. దీనికి 46 దేశాల్లో వినియోగదారులు ఉన్నారు. బ్రిటన్ ఎంపీలు, వైట్‌హౌజ్ ప్రముఖులు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications