హైదరాబాదీతో రెండో పెళ్లి: ఖండించిన భుట్టో భర్త జర్దారీ
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో భర్త అసిల్ అలీ జర్దారీ మరో వివాహం చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇవి పాకిస్తాన్‌లో సంచలనం సృష్టించాయి. అయితే, ఈ వార్తలను ఆయన ఖండించారు.
భారత సంతతికి చెందిన, అమెరికాలో ఉంటున్న డాక్టర్ తన్వీర్ జమానీని అసిఫ్ అలీ జర్దారి రెండో వివాహం చేసుకున్నట్లుగా స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. వారిద్దరికి సాజ్మల్ అనే కుమారుడు ఉన్నాడని చెప్పాయి.

ఆమె హైదరాబాదులో జన్మించారని చెబుతూ, జనన ధ్రవీకరణ పత్రాన్ని చూపించింది. అయితే, ఈ వార్తలు అవాస్తవాలని, తాను చచ్చినా, బతికినా బేనజీర్ భుట్టో భర్తగానే ఉంటానని అసిఫ్ అలీ జర్దారీ చెప్పారు.
జర్దారీ అధికార ప్రతినిధి ఫర్హతుల్లా బాబర్ మాట్లాడుతూ.. ఆ వార్తలు అవాస్తవమని చెప్పారు. 2011లోనే జర్దారీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇలాంటి వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా ఆయన ఖండించారు.












Click it and Unblock the Notifications