తమ్ముడు కావాలంటే: 65ఏళ్ల స్త్రీ గర్భం దాల్చింది, నలుగురు పిల్లలు
బెర్లిన్: ఇప్పటికే పదమూడు ముగ్గురు పిల్లల తల్లి అయిన 65 ఏళ్ల మహిళ మరోసారి గర్భం ధరించింది. ఆమెకు కాన్పు బాగా అయితే ఈసారి నలుగురు పిల్లలకు జన్మనివ్వనుందని తెలుస్తోంది. అరవై ఐదేళ్ల వయసులో గర్భం అసాధ్యం.. అలాంటిది ఈ జర్మన్ మహిళ ఆ వయసులో దాన్ని సుసాధ్యం చేసింది.
ఆమె పేరు అనెగ్రెట్ రౌనిక్. ఆమెకు 13 మంది పిల్లలతో పాటు ఏడుగురు మనవలు, మనవరాళ్లు ఉన్నారు. అయితే చిన్నకూతురు (9) ఆడుకోవడానికి తమ్ముడో చెల్లాయో కావాలని కోరితే మళ్లీ తల్లయిందట అనెగ్రెట్ రౌనిగ్. దీంతో, ఆమె 14వ సారి గర్భం దాల్చిన ఆమె నలుగురికి జన్మనివ్వనుంది.

తన 13వ సంతానమైన తొమ్మిదేళ్ల పాప తమ్ముడు కావాలంటూ పెట్టిన పేచీ మూలంగానే కృత్రిమ విధానం ద్వారా కడుపు పండించుకున్నట్లు ఆమె చెప్పారు. అయితే, గర్భంలో నలుగురు ఉన్నట్లు వైద్యులు చెప్పడంతో తొలుత ఒక్క క్షణం దిగ్భ్రాంతికి లోనయ్యానని చెప్పారు.












Click it and Unblock the Notifications