నైట్ క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం: 29 మంది సజీవదహనం

Istanbul Nightclub: టర్కీలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ నైట్ క్లబ్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 29 మంది సజీవదహనం అయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.

టర్కీ ఆర్థిక రాజధానిగా భావించే ఇస్తాంబుల్‌లో మాస్క్యురెడ్ అనే నైట్ క్లబ్‌లో ఈ దుర్ఘటన సంభవించింది. ఇస్తాంబుల్ గ్యారెటెపే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో ఉందీ నైట్ క్లబ్. 16 అంతస్తులు గల ఓ అపార్ట్‌మెంట్ బేస్‌మెంట్‌లో కొనసాగుతుండేది. మరమ్మతు పనుల కోసం మార్చి 10వ తేదీన అతి మూతపడింది.

At least 29 were killed a fire engulfed Istanbul s nightclub

దాన్ని పునరుద్ధరించడంలో భాగంగా మరమ్మతు పనులు చేపట్టారు. 4,000 మంది ఒకేసారి అక్కడ గుడికూడేలా విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. అదే సమయంలో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:47 నిమిషాలకు స్వల్పస్థాయి పేలుడు సంభవించింది నైట్ క్లబ్‌లో.

నిప్పురవ్వలు చెలరేగాయి. ఫైబర్, ప్లాస్టిక్, థిన్నర్ వంటి నిర్మాణ సామాగ్రి పడటంతో క్షణాల్లో మంటలు చెలరేగాయి. బేస్‌మెంట్ మొత్తాన్నీ అలముకున్నాయి. అగ్నికీలలు అపార్ట్‌మెంట్ మూడో అంతస్తు వరకూ వ్యాప్తి చెందాయి. ఆ సమయంలో 40 మంది వరకు కార్మికులు అందులో ఉన్నట్లు ఇస్తాంబుల్ పోలీసులు అంచనా వేశారు.

బేస్‌మెంట్ కావడం, బయటికి రావడానికి ఒకేదారి ఉండటం వల్ల కార్మికులు అందులో చిక్కుకుపోయారు. మంటల బారిన పడి 29 మంది సజీవదహనం అయ్యారు. ఘాటు పొగ వల్ల మరికొందరు ఊపిరి ఆడకుండా ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. మృతుల కుటుంబాలకు ఇస్తాంబుల్ మేయర్ ఇక్రెం ఇమమొగ్లు సంతాపం తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+