ఘోర రైలు ప్రమాదం.. సొరంగంలో పట్టాలు తప్పిన రైలు.. 36 మంది మృతి,72 మందికి గాయాలు...
తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శుక్రవారం(ఏప్రిల్ 2) ఉదయం ఓ రైలు పట్టాలు తప్పడంతో 36 మంది మృతి చెందారు. మరో 72 మంది గాయపడ్డారు. తైతుంగ్‌కు వెళ్తున్న రైలు హువాలియన్ స్టేషన్‌కు సమీపంలోని ఓ సొరంగంలో పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో రైల్లో మొత్తం 350 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సరిగా పార్క్ చేయని ఓ ట్రక్కు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తైవాన్ అధికారిక మీడియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఆ ట్రక్కు పట్టాల పైకి జారడంతో రైలు దాన్ని ఢీకొని పట్టాలు తప్పినట్లుగా తెలిపింది. సొరంగంలో చిక్కుకుపోయిన రైలు కోచ్‌ల నుంచి 80 నుంచి 100 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు ఫైర్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ప్రమాదంలో ఎనిమిది రైలు కోచ్‌లు ధ్వంసమైనట్లు సమాచారం.

ప్రస్తుతం తైవాన్‌లో కింగ్ మింగ్ ఫెస్టివల్ సీజన్ కావడంతో ఎక్కువమంది స్వగ్రామాలకు ప్రయాణాలు చేస్తున్నారు. పండుగకు ముందు జరిగిన ఈ ప్రమాదం మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.కాగా,2018లోనూ ఈశాన్య తైవాన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో 18 మంది మృతి చెందగా.. 175 మంది గాయపడ్డారు.

ఇటీవలే ఈజిప్టులోనూ ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో 32 మంది మృతి చెందగా మరో 66 మంది గాయపడ్డారు. ఈజిప్టు రాజధాని కైరోకు దక్షిణాన 460 కిలోమీటర్ల దూరంలో గల సోహాగ్ ప్రావిన్స్‌లోని తహ్తా జిల్లాలో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కొన్ని రైలు బోగీలు పూర్తిగా ధ్వంసమవగా.. మరికొన్ని బోగీలు బోల్తా పడ్డాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications