పెను విషాదం: పడవ బోల్తాపడి 58 మంది మృతి

బాంగుయ్: ఆఫ్రికా దేశం సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. పడవ బోల్తా పడి 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన సెట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని బాంగుయ్‌లో చోటు చేసుకుంది. ప్రజలు ఓ గ్రామంలో అంత్యక్రియలకు మోకో నదిపై పడవలో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ఘటన జరిగిన 40 నిమిషాల్లోనే తాము అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది 50 మంది మృతదేహాలను వెలికితీసినట్లు సివిల్ ప్రొటక్షన్ డిపార్ట్ మెంట్ చీఫ్ థామస్ జిమాస్సే తెలిపారు. గల్లంతైన మరికొందరి కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.

At least 58 dead after a boat capsizes in Central African Republic

కాగా, ప్రమాద సమయంలో బోటులో 300 మంది వరకు ఉన్నట్లు ప్రత్యక్షసాక్షలు తెలిపారు. ఓ గ్రామ పెద్ద చనిపోవడంతో బాంగుయ్ కి 45 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతానికి అంత్యక్రియల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు.

మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం తర్వాత రెస్క్యూ సిబ్బంది రావడానికి 40 నిమిషాలు పట్టిందని.. అప్పటికే అక్కడ ఉన్న స్థానిక బోట్లో చేపలు పట్టేవారు పలువురిని కాపాడారని అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటన అనంతరం సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ మెరుగైన నదీ రవాణా భద్రత కోసం చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+