జైలు ఖైదీల మధ్య ఘర్షణ: 60మంది మృతి, తెగిపడిన తలలు

బ్రెజిల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అమెజాన్‌లోని ఓ జైలులో ఇరువర్గాల ఖైదీల మధ్య తలెత్తిన ఘర్షణలో సుమారు 60 మంది మృత్యువాత పడ్డారు.

రియో డీజనీరో: బ్రెజిల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అమెజాన్‌లోని ఓ జైలులో ఇరువర్గాల ఖైదీల మధ్య తలెత్తిన ఘర్షణలో సుమారు 60 మంది మృత్యువాత పడ్డారు. ఈ మేరకు వివరాలను అధికారులు సోమవారం వెల్లడించారు.

ఆదివారం రెండు మాదకద్రవ్య ముఠాల మధ్య జైలులో తలెత్తిన వివాదం ఖైదీలు ఆయుధాలతో పోలీసుల ఎదుట లొంగిపోవడంతో ఈ వివాదం సోమవారం ముగిసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, మరణాల సంఖ్య పెరగడానికి జైలులో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం కూడా కారణమని తెలుస్తోంది.

At least 60 killed in Brazil prison riot: official

జైలులో రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణతోనే ఈ విషాదం చోటుచేసుకున్నట్టు చాప్లిన్‌ అనేఖైదీ వెల్లడించాడు. అల్లర్లు ప్రారంభమైన ఆదివారం మధ్యాహ్న సమయంలోనే జైలు పరిసరాలల్లోనే తలలు తెగిపడిన ఆరు మృతదేహాలు కన్పించడం ఘటన ఎంత క్రూరంగా జరిగిందో తెలుపుతోంది.

ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ప్రపంచంలోనే అమేజాన్ జైలు నాలుగో అతిపెద్దది. 2014 వరకు ఈ జైలులో సుమారు 6,22,000మంది ఖైదీలు శిక్షను అనుభవిస్తున్నారు. కాగా, బ్రెజిల్ జైళ్లలో ఘర్షణలు సాధారణంగా మారిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+