• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రార్థనలు చేస్తుండగా తెగబడ్డ దుండగుడు .. విచక్షణరహితంగా కాల్పులు 9 మంది మృతి

|

వెల్లింగ్ టన్ : శుక్రవారం .. మధ్యాహ్నం నమాజ్ చేసే సమయం. న్యూజిలాండ్ క్రిస్ట్ చర్చ్ నగరంలో ఏ1 మసీదు వద్ద ముస్లింలు బారులుతీరారు. దాదాపు 200 మంది నమాజ్ చేస్తుండగా ఓ మిలిటరీ డ్రెస్ వేసుకొచ్చిన సాయుధుడైన దుండగుడు లోనికి వచ్చాడు. తన చేతిలో ఉన్న తూపాకీ తీసుకొని విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఏం జరుగుతుందో తెలుసుకొనే లోపే జరుగాల్సిన నష్టం జరిగిపోయింది. దేవునికి ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు నేలకొరిగారు. మరో చోట మసీదులో కూడా దుండగులు కాల్పులు జరిపినట్టు న్యూజిలాండ్ పోలీసులు వెల్లడించారు. ఈ రెండు చోట్ల జరిపిన కాల్పుల్లో 9 మంది చనిపోయినట్టు పోలీసులు నిర్ధారించారు. కానీ మొత్తం 27 మంది చనిపోయారని న్యూజిలాండ్ మీడియా చెబుతోంది.

ఆ బ్రిడ్జికి కసబ్ పేరు ..? ఎందుకొచ్చిందంటే ..?

మిలిటరీ డ్రెస్సులో వచ్చిన మృత్యువు ..

మిలిటరీ డ్రెస్సులో వచ్చిన మృత్యువు ..

అందరూ ఓకే చోట చేరి సామూహిక ప్రార్థనలు చేస్తుండగా తుపాకీతో వచ్చిన దుండగుడు మిలిటరీ డ్రెస్సు వేసుకున్నాడని .. వెంటనే తన చేతిలో ఉన్న తుపాకీ తీసి కాల్పులకు తెగబడ్డాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మసీదులో దుండగుడు కాల్పులు జరిపేముందు బంగ్లాదేశ్ క్రికెట్ సభ్యులు కూడా ప్రార్థనలు చేసేందుకు వచ్చారని .. వారంతా క్షేమంగా ఉన్నారని ఆ దేశ కోచ్ రాయిటర్స్ వార్త సంస్థకు తెలిపారు.

 ఎరులైపారిన రక్తపాతం

ఎరులైపారిన రక్తపాతం

మిలిటరీ డ్రెస్ వేసుకున్న దుండగుడు తన వాహనం పార్కింగ్ చేసి ... చేతిలో రెండు తుపాకీలతో మసీదులోకి ప్రవేశించాడు. ఆ తర్వాత కాల్పులు జరిపడంతో పదుల సంఖ్యలో మంది కుప్పకూలిపోయారు. తర్వాతే కారు వద్దకొచ్చి తుపాకీ మార్చాడని .. మళ్లీ మసీదుకు వెళ్లి ఎవరైనా బతికి ఉన్నారో చూశాడని పోలీసులు చెప్తున్నారు. లీన్ వుడ్ లోని మసీదులో రెండోదాడి చేశారని వెల్లడించారు. కాల్పులతో ఏ1 నూర్ మసీదు వద్ద పాఠశాలలు, క్రిస్ట్ చర్చ్ కౌన్సిల్ భవనాలను మూసివేసినట్టు పోలీసులు తెలిపారు.

ముమ్మరంగా తనిఖీలు

ముమ్మరంగా తనిఖీలు

క్రిస్ట్ చర్చ్ నగరంలో కాల్పుల మోత తర్వాత పోలీసులు అప్రమత్తమయ్యాయి. నగరంలోకి వచ్చే దారులన్నీ మూసివేశారు. సిటీలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని న్యూజిలాండ్ పోలీసు కమిషనర్ మైక్ బుష్ వెల్లడించెచారు. కానీ అతడు దాడి చేసినట్టు నిర్ధారించలేమని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిని సమీక్షిస్తున్నామని, దుండగులను పట్టుకుంటామని చెప్తున్నారు. కాల్పుల తర్వాత న్యూజిలాండ్ మసీదు దాడి అని ఒక వీడియో ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. కానీ అది మసీదు కాల్పులకు సంబంధించి కాదని రాయిటర్స్ వార్తసంస్థ పేర్కొంది.

చీకటి రోజు

చీకటి రోజు

మసీదుల్లో దాడిని న్యూజిలాండ్ ప్రభుత్వం ఖండించింది. ప్రార్థన మందిరంలో కాల్పులు జరుగడంతో ఈ శుక్రవారం చీకటి రోజుగా మిగిలిపోతుందన్నారు ఆ దేశ ప్రధానమంత్రి ఆర్డెన్. మసీదులో కాల్పులు జరుపడం అత్యంత పాశవిక చర్యగా ఆయన అభివర్ణించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
A gunman opened fire on Friday prayers at a mosque in New Zealand killing many worshippers and forcing the city of Christchurch into lockdown as police launched a massive manhunt. New Zealand media reported that between nine and 27 people were killed, but the death toll could not be confirmed. Police said multiple fatalities had occurred at two mosques, but it was unclear how many attackers were involved. "This is one of New Zealand's darkest days," said Prime Minister Jacinda Ardern. "Clearly what has happened here is an extraordinary and unprecedented act of violence."Neither Ardern nor police gave a casualty toll.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more