Out of Hydrogen: వృద్ధాప్యంలో పడ్డ సూర్యుడు: అంతర్థానం తప్పదా?
పారిస్: సౌరకుటుంబానికి కేంద్ర బిందువు.. సూర్యుడు. దీన్ని ఆధారంగా చేసుకుని గెలాక్సీ నడుస్తోంది. భూమి సహా సౌర వ్యవస్థలోని గ్రహాలు మనుగడ సాగించడానికి రెడ్ ప్లానెట్ కారణం. అలాంటి సూర్యుడు లేని అంతరిక్షం ఎలా ఉంటుందనేది కనీసం ఊహకు కూడా అందదు. ఉన్నట్టుండి సూర్యుడు అదృశ్యం అయితే- గ్రహాలు ఏమౌతాయి?, వాటి పరిస్థితి..మనుగడ ఎలా ఉంటుందనే విషయం మన ఆలోచనకు కూడా రాదు.

చీకటి కమ్మేస్తుందా?
అది వాస్తవ రూపాన్ని దాల్చే అవకాశం లేకపోలేదని శాస్త్రవేత్తలు, అంతరిక్ష పరిశోధకులు స్పష్టం చేస్తోన్నారు. సూర్యుడు అంతర్థానం అయ్యే రోజులు ఉన్నాయనీ లెక్కలు వేస్తోన్నారు. ఈ అనంత విశ్వాన్ని చీకటి మింగేసే రోజులు రాబోతోన్నాయనీ అంచనా వేస్తోన్నారు. దీనికి సహేతుక కారణాలను సైతం వివరిస్తోన్నారు. తాజాగా- యురోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆధీనంలో పని చేసే గియా స్పేస్‌క్రాఫ్ట్ అందజేసిన డేటాను విశ్లేషించిన అనంతరం నిర్ధారణకు వచ్చారు.

మిడ్ లైఫ్ క్రైసిస్..
ప్రస్తుతం సూర్యుడు మిడ్ లైఫ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్నాడని తేల్చి చెప్పారు. ప్రస్తుతం సూర్యుడి వయసు 4.57 బిలియన్ సంవత్సరాలు. అంతరిక్షంలో సంభవించిన బిగ్ బ్యాంగ్ అనంతరం సూర్యుడు ఆవిర్భవించాడు. దాని తరువాత గ్రహాలు ఏర్పడ్డాయి. ఈ అనంత విశ్వం ఆవిర్భవించిందనేది తెలిసిన విషయం. 12 నుంచి 14 బిలియన్ సంవత్సరాల కిందట బిగ్ బ్యాంగ్ సంభవించింది. సూర్యుడి వయస్సును లెక్కించడానికి బిగ్ బ్యాంగ్‌ను ప్రామాణికంగా తీసుకుంటోన్నారు శాస్త్రవేత్తలు.

హైడ్రోజన్, హీలియం
హైడ్రోజన్, హీలియం మిశ్రమాలతో సూర్యుడు ఏర్పడ్డాడు. ఇదొక సాధారణ నక్షత్రం లాంటిదే. అందులో నుంచి నిరంతరం హైడ్రోజన్, హీలియం వాయువులు వెలువడుతుంటాయి. కార్బన్, నియాన్, సల్ఫర్ వంటివి ఇందులో నుంచి వెలువడుతున్నప్పటికీ.. వాటి పరిమాణం చాలా తక్కువ. అంటే సూర్యుడు తనకు తానుగా మనుగడ సాగించడానికి హైడ్రోజన్ ఆధారం. ఇప్పుడా హైడ్రోజన్ క్రమంగా తరిగిపోతోందని శాస్త్రవేత్తలు, అంతరిక్ష పరిశోధకులు అంచనా వేస్తోన్నారు.

హైడ్రోజన్ అవుట్ ఆఫ్ స్టాక్..
సూర్యుడి అంతానికి సంబంధించిన వివరాల కోసం హైడ్రోజన్‌ను ప్రాతిపదికగా చేసుకుంటోన్నారు. సూర్యుడి నుంచి వెలువడే హైడ్రోజన్ క్రమంగా తగ్గిపోతోందని, కొన్ని సంవత్సరాల తరువాత ఇది పూర్తిగా అడుగంటిపోతుందని అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా- సూర్యుడు ఓ మృత నక్షత్రంగా మిగిలిపోవడం ఖాయమని చెబుతున్నారు. వారి అంచనాలకు శాస్త్రీయబద్ధమైన కారణాలు కూడా ఉన్నాయి. ద్రవ్యరాశిని కోల్పోవడం వల్ల ఇతర నక్షత్రాలు ఏ రకంగా
Recommended Video


సాధారణ నక్షత్రంలాగే..
గియా స్పేస్‌క్రాఫ్ట్ అందజేసిన డేటాను విశ్లేషించిన అనంతరం వారు నిర్ధారణకు వచ్చారు. ద్రవ్యరాశిని కోల్పోయిన ఓ సాధారణ నక్షత్రం ఏ రకంగానైతే మృత నక్షత్రంగా మారుతుందో.. సూర్యుడు కూడా అంతేనని తేల్చి చెప్పారు. సూర్యుడు తన ద్రవ్యరాశిని కోల్పోవడానికి కనీసం 1011 బిలియన్ సంవత్సరాలు పడుతుందని లెక్క గట్టారు. ప్రస్తుతం సూర్యుడు మిడ్ లైఫ్ ఏజ్‌లో ఉన్నాడని, క్రమంగా అంతర్థానమౌతాడనీ నమ్ముతున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications