మహిళపై యువకుల గ్యాంగ్ రేప్: ఫేస్‌బుక్‌లో 'లైవ్'

18, 20, 24 ఏళ్ల వయసు గల ముగ్గురు యువకులు 30ఏళ్ల యువతిపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఫేస్ బుక్ లోని ఓ క్లోజ్డ్ గ్రూప్ లో దీన్ని లైవ్ స్ట్రీమ్ చేయడంతో.. విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది.

స్టాక్‌హోం: సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో.. రోజుకో సంచలనం నమోదవుతూనే ఉంది. మంచి చెడు అన్న తేడా లేకుండా.. వికృత క్రీడలు సైతం సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కుతూ.. సమాజ డొల్లతనాన్ని ప్రశ్నిస్తున్నాయి.

తాజాగా స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో ముగ్గురు యువకులు చేసిన దుర్మార్గం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మహిళపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ యువకులు.. తామేదో ఘనకార్యం చేసినట్టు ఆ తతంగాన్నంతా ఫేస్ బుక్ 'లైవ్' స్ట్రీమ్ చేశారు.

స్టాక్‌హోంకు 70 కి.మీ దూరంలోని ఉప్ప్సల అనే ప్రాంతంలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 18, 20, 24 ఏళ్ల వయసు గల ముగ్గురు యువకులు 30ఏళ్ల యువతిపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఫేస్ బుక్ లోని ఓ క్లోజ్డ్ గ్రూప్ లో దీన్ని లైవ్ స్ట్రీమ్ చేయడంతో.. విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది.

Attackers broadcast woman's horrific gang rape on Facebook Live

దీంతో పోలీసులు ఫేస్ బుక్ నుంచి ఆ వీడియోలను తొలగించారు. గ్యాంగ్ రేప్ ను లైవ్ స్ట్రీమ్ చేసిన క్లోజ్డ్ గ్రూపులో 60వేల మంది సభ్యులు ఉండటం గమనార్హం. జోసెఫీన్‌ అనే యువతి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది.

అనంతరం యువతి మీడియాతో మాట్లాడుతూ పలు వివరాలు వెల్లడించింది. నిందితుల్లో ఒకరైన 24ఏళ్ల వ్యక్తి గతంలోను ఇలాంటి పనులు చేసినట్టుగా తెలిపారు. బాధితురాలి దుస్తులను అతనే తొలుత చింపినట్టుగా చెప్పుకొచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను స్నాప్ చాట్ లో కూడా పెట్టినట్టు తెలిపింది. నిందితుల్లో ఒకరి వద్ద రివాల్వర్ ఉండి వచ్చునని అనుమానిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఇంకేమైనా చిత్రాలు ఎవరి దృష్టికైనా వస్తే.. తమకు అప్పగించాలని పోలీసులు కోరారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని అధికారులు తెలిపారు. ఫేస్ బుక్ కూడా దీనికి సహకరిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+