డీజిల్ కుంభకోణం: ఆడి సీఈఓ అరెస్ట్
బెర్లిన్: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి చీఫ్ ఎగ్జిక్యూటివ్ రూపెర్ట్ స్టాడ్లర్ సోమవారం అరెస్ట్ అయ్యారు. డీజిల్ ఉద్గారాల స్కాండల్ విచారణలో సంబంధం ఉందనే ఆరోపణలతో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆడి సొంతమైన ఫోక్స్ వ్యాగన్ అధికార ప్రతినిధి.. రూపెర్ట్ అరెస్ట్‌ను సోమవారం ధృవీకరించారు.

కాగా, రూపెర్ట్‌ను కస్టడీలోకి తీసుకుని రిమాండ్‌లోకి తరలించాలని జడ్జీ ఆదేశించారు. ఫోక్స్‌వాగన్ కర్బన్ ఉద్గారాల స్కాండల్‌లో మాల్‌ప్రాక్టిస్‌కు పాల్పడ్డారని రూపెర్ట్‌పై విచారణ కొనసాగుతోంది. మోసపూరిత సాఫ్ట్‌వేర్‌ను పొందుపరిచిన 2,10,000 డీజిల్ ఇంజిన్ కార్లను ఆడి 2009 నుంచి అమెరికా, యూరప్‌లలో విక్రయించిందని ఆ కంపెనీపై ఆరోపణలున్నాయి.
మే నెలలోనే తమ 60వేల ఏ6, ఏ7 మోడల్స్‌ను మోసపూరిత సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉన్నట్టు కంపెనీ అంగీకరించడం గమనార్హం. ఈ మోసపూరిత ఆరోపణలు, అక్రమ ప్రొడక్ట్ ప్రమోషన్లపై ఈ లగ్జరీ కారు తయారీదారిపై దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి.
ఈ మోసంలో ఆడి సీఈవో రూపెర్ట్ పాత్ర ఉందని మునిచ్ న్యాయవాదులు జూన్ 13న ప్రకటించారు. ఆయన ఇంట్లో సోదాలు జరిపారు. 1994 నుంచి రూపెర్ట్ ఫోక్స్‌వాగన్-ఆడిలో పనిచేస్తున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications