టెక్కీలకు షాక్: 457 వీసా రద్దు, టెంపరరీ వీసాలు
మెల్‌బోర్న్:భారతీయ టెక్కీలకు మరో షాకింగ్ న్యూస్. ఇప్పటికే అమెరికా నుండి టెక్కీలకు చేదు వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో అస్ట్రేలియా నుండి కూడ ఇదే తరహ సమాచారం వచ్చింది. హెచ్ 1 బీ వీసాలపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కఠినమైన నిర్ణయాలు తీసుకొంది. అదే తరహలో 457 వీసాలను రద్దు చేస్తూ అస్ట్రేలియా నిర్ణయం తీసుకొంది.
అమెరికాకు ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి టెక్కీలకు ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ట్రంప్ తీసుకొన్న నిర్ణయాలు ఇండియన్ టెక్కీలకు, ఇండియా టెక్ కంపెనీలకు తీవ్ర నష్టాన్ని కల్గిస్తున్నాయి.
స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో హమీ ఇచ్చారు. ఈ హమీ ప్రకారంగా నిర్ణయాలు తీసుకొంటున్నారు. అయితే తాజాగా అస్ట్రేలియాలో తీసుకొన్న నిర్ణయం కూడ భారత టెక్కీలకు ఇబ్బందిగా మారింది.

ఇండియా టెక్కీలకు నిరాశ
ఇండియన్ టెక్కీలకు మరో షాకింగ్ నిర్ణయం అస్ట్రేలియా తీసుకొంది. ఇప్పటికే అమెరికాలో ట్రంప్ తీసుకొన్న నిర్ణయాలు ఇండియన్ టెక్కీలకు ఇబ్బందులను కల్గిస్తున్నాయి అస్ట్రేలియా ప్రభుత్వం 457 వీసాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొంది అమెరికా బాటలోనే అస్ట్రేలియా కూడ నడుస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కొత్త వీసా విధానం
కొత్తగా వీసా విధానాన్ని తీసుకురావాలని అస్ట్రేలియా నిర్ణయం తీసుకొంది 457 వీసాను రద్దు చేసింది. దీని స్థానంలో టెంపరరీ స్కిల్ షార్టేజ్ వీసాను తీసుకురావాలని నిర్ణయించింది. మార్చి 18 నుండి ఈ కొత్త వీసా పద్దతిని అమలు చేస్తోంది. ఈ విధానం ఇండియన్ టెక్కీలకు నష్టం కల్గిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు

అస్ట్రేలియాలో ఇండియన్ టెక్కీలే ఎక్కువ
అస్ట్రేలియా దేశంలో ఉన్న 90 వేల మంది విదేశీ ఉద్యోగుల్లో ఎక్కువగా ఇండియన్స్ ఉన్నారు. అస్ట్రేలియా అధికారిక లెక్కల ప్రకారంగా సుమారు 22 శాతం మంది ఇండియన్స్ అస్ట్రేలియాలో టెక్కీలుగా పనిచేస్తున్నారు. ఈ కొత్త విధానంతో అక్కడ పనిచేస్తున్న ఇండియన్ టెక్కీలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు నిపుణులు.

శాశ్వత నివాసం కష్టమే
అస్ట్రేలియా తాజాగా తీసుకొన్న నిర్ణయంతో ఆ దేశంలో శాశ్వత నివాసం కోరుకొంటున్న ఇండియన్లకు శాపంగా పరిణమించనుంది. అవసరమైన ఉద్యోగాల్లో అవసరమైన నిపుణులను నియమించుకొనేందుకు 457 వీసా వీలు కల్పిస్తోంది. అయితే దీన్ని రద్దు చేస్తూ అస్ట్రేలియా నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం శాశ్వత నివాసం కోరుకొంటున్న ఇండియన్లకు 457 వీసా రద్దు చేస్తూ తీసుకొన్న నిర్ణయం నష్టాన్ని కల్గిస్తోంది. అయితే అవసరాన్ని బట్టి తమ దేశంలో విదేశీయులకు వర్క్ వీసాలను ఇవ్వాలని అస్ట్రేలియా నిర్ణయం తీసుకొంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications