ఫేస్‌బుక్, గూగుల్ మీడియా కంటెంట్‌కు రుసుము: కీలక చట్టం చేసిన ఆస్ట్రేలియా
మెల్బోర్న్: ఆస్ట్రేలియా పార్లమెంటు కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో ప్రచురించే కంటెంట్‌కు సంబంధించి మీడియా సంస్థకు రుసుము చెల్లించేలా తయారు చేసిన 'న్యూస్ మీడియా బార్గైనింగ్ కోడ్' బిల్లును ఆస్ట్రేలియా పార్లమెంటు గురువారం ఆమోదించింది. ఈ మేరకు వివరాలను ఆస్ట్రేలియా కమ్యూనికేషన్స్ మంత్రి పాల్ ఫ్లెచర్ వెల్లడించారు.
తాజా చట్టంతో ఇక నుంచి ఫేస్‌బుక్, గూగుల్ సంస్థలు తమ ఫ్లాట్‌ఫాంలలో ప్రచురించే న్యూస్ కంటెంట్‌పై ఆ దేశ మీడియా సంస్థలకు రుసుము చెల్లించాల్సి ుంటుందని పాల్ తెలిపారు. దేశంలోని మీడియా మాధ్యమాలతో వాణిజ్య సంబంధాలను ఏర్పాటు చేసుకోవడంలో గూగుల్, ఫేస్‌బుక్‌లు పురోగతి సాధించడంపై సంతోషిస్తున్నామని చెప్పారు.

మీడియా సంస్థలు తాము సామాజిక మాధ్యమాలకు ఇచ్చే కంటెంట్‌పై రెమ్యూనరేషన్ పొందడానికి ఈ కోడ్ ఉపకరిస్తుందని తెలిపారు. ఆస్ట్రేలియాలో ప్రజాప్రయోజన జర్నలిజం మరింత మెరుగవడానికి ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని పాల్ ఫ్లెచర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. గత మూడేళ్లుగా చర్చలు, విశ్లేషణలు జరిపిన అనంతరం బిల్లును చట్టంగా మార్చింది ఆస్ట్రేలియా ప్రభుత్వం.
అయితే, ఆస్ట్రేలియా తీసుకొచ్చిన చట్టాన్ని ఫేస్‌బుక్, గూగుల్ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అంతేగాక, ఆస్ట్రేలియా వార్తలను ప్రసారం చేయడాన్ని కూడా నిలిపివేసింది. అయితే, బిల్లులు పలు సవరణలకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అంగీకరించడంతో ఫేస్‌బుక్ రెండ్రోజుల క్రితం తిరిగి ఆస్ట్రేలియా వార్తలను పంచుకోవడాన్ని అనుమతించింది. కాగా, ఆస్ట్రేలియా బాటలోనే కెనడా, బ్రిటన్ లాంటి దేశాలు కూడా ఇదే తరహా బిల్లులను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. వీటితోపాటు మరికొన్ని దేశాలు కూడా ఇదే రకమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications