వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రాలలో బిలియన్ డాలర్ల డ్రగ్స్: ఛేదించారిలా(వీడియో)

|
Google Oneindia TeluguNews

సిడ్నీ: దేశ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రాకెట్‌ను ఆస్ట్రేలియా పోలీసులు ఛేదించారు. హాంగ్‌కాంగ్ నుంచి అక్రమంగా ఆస్ట్రేలియాలోకి తీసుకు వచ్చిన 720లీటర్ల మెతామ్ ఫెటమైన్(డ్రగ్స్)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, డ్రగ్స్ మాఫియా ఈ డ్రగ్స్‌ను అమ్మాయిలు ధరించే జెల్ బ్రాలలో అక్రమంగా తీసుకొచ్చారు.

నిఘావర్గాల సమాచారంతో పోలీసులు స్వాధీనం చేసుకున్న మెతామ్ ఫెటమైన్ విలువ 1బిలియన్ డాలర్లు (దాదాపు 4.3వేల కోట్ల రూపాయలు) ఉంటుందని అంచనా. ఈ ఘటనతో ప్రమేయముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక చైనా వ్యక్తితో పాటు ముగ్గురు హాంగ్‌కాంగ్‌కు చెందిన వారిని ఆస్ట్రేలియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆస్ట్రేలియా చరిత్రలోనే పట్టుబడిన అత్యంత పెద్ద డ్రగ్స్ రాకెట్ ఇదేనని జస్టిస్ మినిస్టర్ మిచెల్ కినాన్ తెలిపారు. సిడ్నీలో సీజ్ చేసిన ద్రవరూపంలో ఉన్న డ్రగ్ నుంచి 500కిలోల క్రిస్టల్ మెత్‌ను తయారు చేయొచ్చని ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ కమాండర్ క్రిస్ షీహాన్ చెప్పారు.

నిఘావర్గాల సమాచారంతో సిడ్నీలోని మిరండా, హర్స్‌ట్ విల్లే, పెడాస్టో, కింగ్స్ గ్రూవ్ ప్రాంతాల్లోని గోడౌన్లలోకి వచ్చిన సరుకులను తనిఖీ చేయగా జెల్ బ్రాలతో పాటూ ఇంటి ఉపకరణాలలో నిలువ చేసిన డ్రగ్స్‌ను కనుగొన్నామని తెలిపారు. చైనా అధికారుల సహాయంతో గత కొంత కాలంగా నిఘా పెంచి ఈ మెతామ్ ఫెటమైన్ రాకెట్‌ను ఛేదించగలిగామని తెలిపారు.

English summary
Police in Sydney have seized methamphetamine with a street value of more than A$1bn ($700m; £500m), much of it hidden inside gel bra inserts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X