ప్రీతిరెడ్డి హత్య కేసు: కేసును ఛేధించడంలో తలమునకలైన ఆస్ట్రేలియా పోలీసులు
ఆస్ట్రేలియాలో హత్యకు గురైన వైద్యురాలు ప్రీతిరెడ్డి కేసులో మిస్టరీ వీడలేదు. అసలు ప్రీతి రెడ్డి మృతి చెందడానికి ఏమి జరిగిందో అనేదానిపై ఆస్ట్రేలియా పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆమె హత్యకు గురికాకుముందు రెండు రోజుల ముందు నుంచే కనిపించకుండా పోయింది. అయితే పోలీసలు మాత్రం ప్రీతిరెడ్డిని తన మాజీ ప్రియుడు హర్ష హత్య చేసి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారాంతంలో ప్రీతి రెడ్డి ఓ సెమినార్‌కు హాజరయ్యేందుకు సిడ్నీకి వచ్చిందని అది తెలుసుకున్న హర్ష కూడా టామ్ వర్త్ నుంచి 400 కిలోమీటర్లు ప్రయాణించి ఆమె కోసం వచ్చినట్లు వారి స్నేహితులు తెలిపారు.

అయితే సెమినార్ తర్వాత ఇద్దరు మాట్లాడుకోవడం కనిపించారని ఇద్దరి కామన్ ఫ్రెండ్ ఒకరు చెప్పారు. ప్రీతి మరొకరితో సన్నిహితంగా ఉందని తెలుసుకుని ఆమెతో మాట్లాడేందుకే టాంవర్త్ నుంచి హర్ష వచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరూ బాగానే మాట్లాడుకున్నట్లు ఇద్దరికీ తెలిసిన ఓ వ్యక్తి తెలిపాడు. అనంతరం ప్రీతి రెడ్డి ఒక్కరే ఎక్కిడికో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీసీ కెమారాల్లో కినిపిస్తోంది. తనకు తెలిసిన మరో వ్యక్తితో ప్రీతిరెడ్డి అదే హోటల్‌లో బస చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఆదివారం ఉదయం ప్రీతిరెడ్డి తన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉంటే హర్ష పోర్టర్ సహాయంతో ఓ పెద్ద సూట్‌కేసును కారులోకి ఎక్కిస్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమరాల్లో రికార్డు అయినట్లు ఓ ఛానెల్ కథనం ప్రసారం చేసింది. ఆ సూట్‌కేసులోనే ప్రీతిరెడ్డి మృతదేహం ప్యాక్ చేసి ఉండొచ్చనే అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.అయితే ప్రీతిరెడ్డి కనిపించడం లేదన్న వార్త బయటకు రావడంతో... ప్రీతిరెడ్డి శనివారం సాయంత్రం తనతో మాట్లాడిందని ఇంటికి వెళుతున్నట్లు తనతో చెప్పినట్లు హర్ష మరొక స్నేహితుడికి మెసేజ్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఎక్కడైనా నిద్రపోయి ఉంటుందని కూడా హర్ష తన స్నేహితుడికి మెసేజ్ పెట్టినట్లు సమాచారం.ఇదిలా ఉంటే అప్పటికే హర్షవర్ధన్ ఆమెను హత్యచేసి ఉండొచ్చని ఆస్ట్రేలియా పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు ప్రీతిరెడ్డి, హర్షవర్ధన్ ఏం మాట్లాడుకున్నారు?, ఇద్దరి మధ్య గొడవ జరిగిందా?, హత్యకు దారితీసిన పరిస్థితులేంటి? అన్న విషయాలు మిస్టరీగా మారాయి. అక్కడేం జరిగిందో చెప్పడానికి ఎవరూ లేకపోవడంతో ఈ మిస్టరీని చేధించడానికి పోలీసులు తల ప్రాణం తోకకొస్తోంది.
మరోవైపు మృతిచెందిన ప్రీతిరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆస్ట్రేలియాలోని పలు ప్రాంతాల్లో శనివారం శాంతిర్యాలీ నిర్వహించనున్నారు వైద్యులు. సిడ్నీ టౌన్ హాలు,బ్రిస్బేన్‌లోని కింగ్ జార్జ్ స్క్వేర్, మెల్‌బోర్న్‌లోని ఫెడరేషన్ స్క్వేర్‌లో క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించనున్నారు. మరో వైపు మార్చి 16న సాయంత్రం 6గంటల ప్రాంతంలో కాన్‌బెర్రాలో కూడా క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించనున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications