దించకుండా బీరు తాగిన ప్రధాని టోనీ: ఏడు సెకన్లలోనే
సిడ్నీ: అధికారులు, అభిమానుల ప్రోత్సహించడంతో ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ ఎత్తిన బీరు గ్లాసు దించకుండా తాగేశారు. అది కూడా కేవలం 7 సెకన్లలోనే కావడం గమనార్హం. రూల్స్ ఫుట్‌బాల్ ఆటగాళ్ల కోసం సిడ్నీలోని ఓ పబ్‌లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి టోనీ అబ్బాట్ హాజరయ్యారు.
ఈ సమయంలోనే అభిమానులు, అధికారుల హర్షధ్వానాల మధ్య గ్లాసు దించకుండా బీరు తాగేశారు. అబ్బాట్ బీరు తాగిన దృశ్యాలు కెమెరా కంటికి చిక్కగా, అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.

టోనీ తీరు అక్కడివారిని ఉత్సాహ పర్చగా.. మద్య సేవనం తగ్గించుకోవాల్సిన అవసరంపై మంచి మాటలు చెప్పాల్సిందిపోయి ఆయనే స్వయంగా మద్యం సేవించి ప్రజలకు చెడు సంకేతాలిస్తున్నారని మరికొందరు మండిపడుతున్నారు.
ఆస్ట్రేలియాలో మద్యం సేవిస్తున్నవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, గతంలో ప్రధాని టోనీ కూడా మద్యం సేవిస్తున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతిగా మద్యం సేవించడం మంచిది కాదని చెప్పారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications