Student Visa: డిపెండెంట్ వీసాలు బంద్.. ఆస్ట్రేలియా వెళ్లే విద్యార్థులకు బిగ్ షాక్

ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాలని కలలు కనే విదేశీ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులు తమ జీవిత భాగస్వాములను (భార్య/భర్త), పిల్లలను కూడా తమతో పాటు తీసుకెళ్లే వెసులుబాటు ఉండేది. అయితే ఇకపై అలాంటి అవకాశాలకు చెక్ పెడుతూ, విద్యార్థులు తమ కుటుంబ సభ్యులను వెంట తీసుకురాకుండా నిషేధం విధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. దీనికితోడు తాత్కాలిక వీసాలపై ఉన్నవారు ఇతర వీసాల్లోకి మారే నియమాలను కూడా మరింత కఠినతరం చేయనుంది.

వలసల కట్టడికి ప్రణాళిక.. 2028 నాటికి భారీ కోత!

దేశంలోకి విపరీతంగా పెరుగుతున్న వలసదారుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పటిష్ట చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ప్రతిటా సుమారు 3 లక్షలుగా ఉన్న నికర విదేశీ వలసదారుల సంఖ్యను 2028 నాటికి 2,25,000కు తగ్గించాలని ఆస్ట్రేలియా హోం వ్యవహారాల శాఖ భావిస్తోంది. కొవిడ్ నిబంధనలు ఎత్తివేసిన తర్వాత అంతర్జాతీయ విద్యార్థులు, తాత్కాలిక కార్మికుల రాక ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని సమాచారం.

Australia Student Visa New Rules No Dependents Allowed for International Students to Cut Migration Flow
E-Visa: భారతీయులకు మరో యూరప్ దేశం బంపర్ ఆఫర్: ఈ కొత్త దేశం చూసేయండి!
E-Visa: భారతీయులకు మరో యూరప్ దేశం బంపర్ ఆఫర్: ఈ కొత్త దేశం చూసేయండి!

ఇంటి అద్దెలు, మౌలిక వసతులపై తీవ్ర ఒత్తిడి!

గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో విదేశీ వలసదారుల సంఖ్య గణనీయంగా పెరగడం వల్ల అక్కడ నివాస గృహాల కొరత తీవ్రమైంది. అద్దెలు ఆకాశాన్ని తాకడంతో పాటు స్థానిక మౌలిక వసతులపై విపరీతమైన భారం పడుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో పెరిగిన ఇళ్ల కొరత, రవాణా ఇబ్బందులకు చెక్ పెట్టాలంటే వలసదారుల సంఖ్యను నియంత్రించక తప్పదని స్థానిక రాజకీయ వర్గాలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి.

Visa Free Entry: భారతీయులకు బంపర్ ఆఫర్.. 'వీసా' లేకుండానే ఆ దేశానికి!
Visa Free Entry: భారతీయులకు బంపర్ ఆఫర్.. 'వీసా' లేకుండానే ఆ దేశానికి!

భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం!

ఆస్ట్రేలియా వెళ్లే విదేశీ విద్యార్థులలో సగానికి పైగా వాటా చదువుకోవడానికి వెళ్లేవారే ఉంటారు. ఇప్పటివరకు డిగ్రీ లేదా మాస్టర్స్ చేసేవారు తమ భాగస్వామిని తీసుకెళ్తే, అక్కడ వారు వర్క్ పర్మిట్ అనుమతి ఉండేది. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే, కుటుంబ సమేతంగా వెళ్లి చదువుకోవాలనుకునే భారత్ సహా ఇతర దేశాల విద్యార్థులకు తీవ్ర నిరాశే మిగలనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+